Summar Tips : ఎండాకాలం వచ్చింది అంటే.. శరీరం చెమట పట్టడం సర్వసాధారణం. కానీ అధిక చెమట విసుగు తెప్పించి, ఒక్కోసారిరి డీహైడ్రేషన్ కావడానికి కూడా కారణం అవుతుంది. మరి వేసవిలో చెమట సమస్య నుండి తప్పించుకోవడానికి ఇలా చేయండి..
* ఉదయం నిద్రలేవగానే స్నానం ,అలాగే రాత్రి పడుకునే ముందు కూడా స్నానం చేస్తే. శరీరానికి ఎక్కువ చెమట పట్టదు.
* ఒక గ్లాస్ నీటిలో సైడర్ వెనిగర్ కలిపి, అందులో కాటన్ బాల్‌ను ముంచి, దానితో గొంతు, చంకలు, చేతులు, అరికాళ్లకు రాత్రి నిద్రపోయే ముందు ఇలా మర్దన చేస్తే చెమట వాసన కాస్త తగ్గుతుంది.
* బలమైన ఎముకలకు కాల్షియం చాలా అవసరం. అలాగే శరీర ఉష్ణోగ్రత నియంత్రించడానికి కాల్షియం ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి రోజూ తీసుకునే ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి.
కాల్షియం కోసం పాలు, పెరుగు, నువ్వులతో చేసిన ఆహారం ఎక్కువగా తినాలి.
* ఆహారంలో మసాలాలు, కారం, నూనె ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. వేసవిలో ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల శరీరం నుంచి ఎక్కువ నీరు బయటకు వెళ్ళిపోతుంది. అందుకే ఎక్కువగా చెమట వస్తుంది.
* టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపించడంలో సహాయం చేస్తాయి.
ప్రతి రోజు గ్లాస్ టమాటా రసం తాగితే చాలా మంచిది.
* ఉప్పు ఎక్కువగా తిన్న చెమట ఎక్కువగా వస్తుంది. వేసవిలో ఉప్పును చాలా తక్కువగా తీసుకోవాలి.
* అధిక ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా ఉన్నా… చెమట అధికంగా వచ్చేస్తుంది. అందుకే ప్రతి రోజు ధ్యానం, శ్వాస ఎక్సర్సైజ్లు చేయడం ద్వారా కూడా చెమట సమస్యకు చెక్ పెట్టవచ్చు.