Ram Charan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న చిత్రం కిసీ కా భాయ్ కిసీ కా జాన్. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు ఫర్హాద్ సమ్‌జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ కాగా
విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించనున్నాడు. ఈ ఇంట్రెస్టింగ్ కాంబో మూవీలో చరణ్ కూడా ఓ స్పెషల్ సాంగ్ లో అదరగొట్టాడు. తెలుగు లిరిక్స్‌తో ప్రారంభమైన ఈ సాంగ్‌లో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్, రామ్ చరణ్‌లు.. సల్మాన్ ఖాన్‌తో కలిసి డ్యాన్స్ అదరగొట్టారు. ఈ మాస్ ఫెస్టివల్ సాంగ్‌ను అన్ని భాషల అభిమానులకు నచ్చేలా డిజైన్ చేశారు.
సల్మాన్ ఖాన్ కు మెగాఫ్యామిలీకి మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ చరణ్ ని ఆరాధించే జానీ మాస్టర్ కావడంతో ఈ సాలిడ్ కాంబో సెట్టయ్యింది. మరి సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఈ సినిమాను ఏప్రిల్ 21న రంజాన్ సందర్భంగా విడుదల చేయనున్నారు.