Dasara Movie : న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. తెలంగాణాలో బొగ్గు గనుల నేపథ్యంలో యాక్షన్ డ్రామాతో రూపొందిన దసరా, అక్కడి వారి మాసిన జీవితాలని కళ్లకు కట్టినట్టు చూపించారు. భారీ అంచనాల నడుమ మార్చి 30న విడుదలైన దసరా
అదే రేంజ్ లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే 92 కోట్లు వసూలు చేసిన దసరా త్వరలో 100 కోట్ల క్లబ్ లో చేరనుంది. డైరెక్టర్ కి ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ హీరో నానికి, ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరికి కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. దీంతో నిర్మాత సుధాకర్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇప్పటికే పడి పడి లేచె మనసు, విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు తీసారు.
కానీ అవి ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దీంతో దసరా సూపర్ హిట్ అవ్వడంతో ప్రొడ్యూసర్ ఓ భారీ గిప్ఠ్ ను దర్శకుడు శ్రీకాంత్ కు ఇవ్వబోతున్నారట. ఇప్పటికే BMW కార్ ను బుక్ చేశారట. ఒకటి, రెండు రోజుల్లో అది డెలివరీ తీసుకొని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు ఇవ్వనున్నారు. అంతేకాదు నెక్స్ట్ మూవీకి శ్రీకాంత్ ను తమ బ్యానర్ లోనే వుంచుకోవాలనుకుంటున్నారు.
Discussion about this post