Nayanthara : నయన తార.. ఏం చేసినా అది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ.. లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళంలోనూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే నయనతార సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలే ఎప్పుడు చర్చనీయాంశంగా ఉండేవి. వీటన్నింటికి తెర దించుతూ ఎట్టకేలకు ఇటీవల నయన్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది.
ఈ క్రమంలోనే నిన్న నయన్ తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి కుంభకోణం సమీపంలోని కులదేవుడి ఆలయాన్ని సందర్శించారు. ఈ దంపతులకు అభిమానులు.. అక్కడి అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరిద్దరు కుంభకోణం పక్కనే ఉన్న మేళవత్తూరు గ్రామంలోని నది ఒడ్డున ఉన్న తమ కులదేవత కామత్షి అమ్మాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అక్కడ నయన్ దంపతులతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.
ఓ అమ్మాయి నయన్ భుజాన్ని లాగింది. దీంతో నయన్ అసహనానికి గురైంది. అనంతరం నయన్ దంపతులు తిరుచ్చి రైల్వే స్టేషన్‌కు చేరుకోగా.. అక్కడ కూడా అభిమానుల తీరుతో అసహనానికి గురైంది. ట్రైన్ లోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. సెల్ఫీ తీసుకుంటూ నయన్, విఘ్నేష్ శివన్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన నయన్.. ఫోటో తీస్తే ఫోన్ పగలగొట్టేస్తాను అంటూ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.