Ravanasura Review : నటీనటులు : రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్ష నాగార్కర్.
నిర్మాత : అభిషేక్ నామా, రవితేజ
దర్శకత్వం : సుధీర్ వర్మ
సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
విడుదల తేదీ : ఏప్రిల్ 7, 2023
కథ :
రవీంద్ర (రవితేజ) ఒక క్రిమినల్ లాయర్. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన కనక మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర జూనియర్ లాయర్ గా పని చేస్తూ ఉంటాడు. ఇంతలో హారిక (మేఘ ఆకాష్) తండ్రి సంపత్ ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. రవీంద్ర ఈ కేస్ ను టేకప్ చేయడానికి ఆసక్తి చూపిస్తాడు. అసలు ఆ హత్య ఎవరు చేశారు? చనిపోయింది ఎవరు? వీటికి రవీంద్రకి ఏమైనా సంబంధం ఉందా? రవీంద్ర, సాకేత్ (సుశాంత్) ని ఎలా కలిశాడు? అసలు ఈ సాకేత్ ఎవరు? ఇవన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..
రివ్యూ :
ఇటీవల వచ్చిన ధమాకా సినిమాతో హిట్ కొట్టాడు మాస్ మహారాజ్ రవితేజ. అలాగే చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక కమర్షియల్ సినిమాలో నడిచినట్లుగానే నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో సినిమా స్పీడ్ పెరుగుతుంది. కానీ అది ముందుకు వెళ్లే కొద్దీ ప్రేక్షకులకి తర్వాత ఏం జరుగుతుంది అనేది అర్థం అవుతూ ఉంటుంది. ఇందులో రవితేజ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదేమో..
ప్లస్ పాయింట్స్..
రవితేజ
పాటలు
కొన్ని యాక్షన్ సీన్స్
ఇంటర్వల్ కి ముందు వచ్చే ట్విస్ట్
మైనస్ పాయింట్స్..
కామెడీ,
స్లో స్క్రీన్ ప్లే,
లాజిక్ లేని కొన్ని సీన్స్
రేటింగ్ : 2.50/5
ట్యాగ్ లైన్ : మంచి యాక్షన్ థ్రిల్లర్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించి.. రొటీన్ క్లైమాక్స్ తో ముగుస్తుంది.