Meter Review : నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పవన్, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి తదితరులు
దర్శకుడు : రమేష్ కాడూరి
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
సంగీత దర్శకులు: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ ఆర్
విడుదల తేదీ : ఏప్రిల్ 07, 2023
కథ :
అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) తండ్రి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. కానిస్టేబుల్ గా పని చేస్తూ తన నిజాయితీ కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కుంటూ ఉంటాడు. కొడుకుని ఎస్సై చేయాలనేది ఆయన కల. కానీ అర్జున్ కి పోలీస్ అవ్వడం అసలు ఇష్టం ఉండదు.
అనుకోకుండా సెలక్షన్ క్లియర్ చేసి ఎస్సై అయిపోతాడు అర్జున్. డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు డిస్మిస్ అవ్వాలా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా హోం మినిస్టర్ కంఠం బైరెడ్డితో (పవన్) అర్జున్ కళ్యాణ్‌కి క్లాష్ వస్తుంది. ఎలక్షన్స్‌లో అధికారంలోకి రావడానికి బైరెడ్డి చేసిన స్కామ్ ఏంటి? దాని వల్ల పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎలా ఎఫెక్ట్ అయింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
రివ్యూ:
ఏ హీరోకైనా మాస్ ఇమేజ్ రావాలని ఉంటుంది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా అదే కోరికతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ డైలాగులు ఫైట్ లతో రెచ్చిపోయాడు. అయితే మీటర్ పూర్తి రొటీన్ సినిమా ఎక్కడా కూడా కొత్తదనం ఉండదు. అప్పట్లో స్టార్ హీరోలు ఇలాంటి సినిమాలు చేసి అలసిపోయారు.
ప్రస్తుతం ప్రేక్షకుల పల్స్ పట్టుకుని సినిమాలు చేస్తున్నారు. కానీ యంగ్ హీరో ఇలాంటి రొటీన్ కథతో రావడం ప్రేక్షుకులకు బోర్ కొట్టించింది. అంతే కాకుండా అవే జోకులు కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి. ఇక సినిమాకు మ్యూజిక్ కూడా అతి పెద్దమైనస్ అయ్యింది.
ప్లస్ పాయింట్స్:
* కిరణ్ అబ్బవరం నటన,
* మాస్ సన్నివేశాలు,
* కొన్ని డైలాగులు
మైనస్ పాయింట్స్:
* మ్యూజిక్
* ముందుగా ఊహించే సీన్స్
రేటింగ్: 2/5
ట్యాగ్ లైన్ : కిరణ్ అబ్బవరం మీటర్‌లో మాస్ ఉన్నప్పటికీ, ఆడియన్స్ రేంజ్‌కు తగ్గ రీడింగ్‌ను రీచ్ అవ్వలేదు.