Weight Loss Tips : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా మన శరీర బరువు అదుపులో ఉండాలి. కాస్త శ్రద్ధ పెట్టి శరీర బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొంది సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. లేదంటే బరువు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే బరువు పెరగడం తగ్గడం అనేది మన చేతుల్లోనే, మనం తినే ఆహారంలోనే ఉంటుంది.
మనం ఉన్న ఎత్తుకు తగ్గట్టు బరువును మెయింటేన్ చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే బరువు కంట్రోల్ తప్పుతుందో చూద్దాం..
* ఆరోగ్యాన్ని పాడు చేసే అనారోగ్యకరమైన ఆహారాలు ముఖ్యంగా జంక్ ఫుడ్, తీపి పదార్థాలు ఇవి తినడం వల్ల త్వరగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
* కొందరు రాత్రిపూట కొన్ని ఆహారాలను, పానీయాలు తీసుకుంటూ ఉంటారు. ఇలా టైం గానీ టైమ్ లో తినడం వల్ల కూడా త్వరగా బరువు పెరుగుతారు.
* ముఖ్యంగా టీ, కాఫీలు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువగా తాగుతూ ఉంటారు కొందరు. ఒక్క కప్పు తాగడం వల్ల పెద్దగా నష్టం ఏముందిలే అనుకుంటూ ఉంటారు. రాత్రి పూట వీటిని తాగడం వల్ల వాటిల్లో ఉండే కెలరీలు, కెఫిన్ శరీర బరువును పెంచుతుంది.
* చాలామందికి మద్యం సేవించే అలవాటు ఉంటుంది. ఆల్కహాల్ తాగే వారు ఎక్కువగా రాత్రి సమయాల్లో తీసుకుంటూ ఉంటారు. ఇది బరువు పెరగడానికి ఎంతో దోహదం చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలి అంటే ఆ అలవాటు మానుకుంటే మంచింది.
* రాత్రి పూట కడుపు నిండా నాన్ వెజ్ తినడం కూడా బరువును పెంచుతుంది. ముఖ్యంగా చికెన్ బిర్యానీలు, మటన్ ఫ్రైలు తినేసి పడుకోవడం వల్ల అధిక బరువు పెరిగి పొట్ట కూడా పెరుగుతుంది. ఒకవేళ నాన్ వెజ్ తినాలి అనుకుంటే సాయంత్రం ఏడు లోపే తినడం మంచిది.