Blood Group Theory : మన ఒంట్లో ఉండే బ్లడ్ గ్రూప్ ని బట్టి మన ప్రవర్తనను, మన గుణాన్ని చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. అవును మన బ్లడ్ గ్రూప్ ని బట్టి మన క్యారెక్టర్ ని డిసైడ్ చేయొచ్చు. అయితే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో ఇప్పుడు చూద్దాం..
బ్లడ్ గ్రూపు A..
ఈ గ్రూప్ వారికి చాలా ఓర్పు ఉంటుందట. వీరు వారి భావాలను బయటకు చెప్పరు. ఈ గ్రూప్ వాళ్ళు పరిపూర్ణంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు వీళ్ళల్లో బాధ్యత, విశ్లేషణాత్మకత, సృజనాత్మకతతో పాటు తెలివితేటలు కూడా చాలా ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా గొడవ పడటానికి ఇష్టపడరు. అయితే వీళ్లకు కోపం కూడా ఎక్కువే.
బ్లడ్ గ్రూప్ B..
ఈ టైప్ వ్యక్తుల్లో సృజనాత్మకత, ప్రత్యేకవాదం, ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడే స్వభావం ఉంటాయి. వీటితో పాటు కొన్ని సమయాల్లో స్వార్థంగా ఆలోచించడం, బాధ్యతా రాహిత్యంగా మెదలడం మరియు తొందరగా అసహన పడడం అలాంటివి కూడా ఎక్కువగానే ఉంటాయి.
వీరు ఎక్కువగా స్నేహితులతో ఉండడానికి ఇష్టపడతారు. ఏదైనా పని చెప్తే బద్ధకంగా ఫీల్ అవుతారు.
బ్లడ్ గ్రూప్ O..
ఈ గ్రూపు వారిలో ఆత్మవిశ్వాసంతో పాటు ఆశయం, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు మరియు అన్ని సానుకూల లక్షణాలు ఉంటాయి. మరో వైపు దురహంకారం, పొగరు, ఎక్కువగా నటించడం లాంటిది కూడా ఉంటాయి. జూదం వంటి రిస్క్ ఉన్న పనులను కూడా ఎక్కువగా చేస్తారు. జీవితంలో ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు.
AB రక్త గ్రూపు ఉన్న వాళ్ళు మంచి వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉంటారు. స్నేహపూర్వకంగా ఉంటారు. వీళ్ళకి ఊహా, తెలివితేటలు, యోగ్యత, ఆసక్తి, చాలా ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ గ్రూప్ కలిగిన వారు అధిపతిగా ఉండటానికి ఇష్టపడతారు. ఏదైనా నిర్ణయాన్ని తెలివితో అనూహ్యంగా తీసుకుంటారు. వీళ్ళు భావోద్వేగానికి ఎక్కువగా గురావుతారు.
Discussion about this post