Health Tips Leg Nails : మన శరీరంలో కాళ్ళ వేళ్ళు అన్ని సమానంగా ఉండవు. ఒక్కో వేలు ఒక్కో సైజ్ లో ఉంటుంది. ఈ కాలి వేళ్ళు ఒక్కోక్కరి శరీరంలో ఒక్కోరకంగా ఉంటాయి. అయితే కొంతమంది కాలి వేళ్ళు వేరుగా ఉండటం కూడా మనం గమనిస్తూ ఉంటాము. కొంతమంది అమ్మాయిల్లో కాలి బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటుంది. అందరిలో అలా ఉండదు అలా ఉండటం గురించి కూడా పెద్దోళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు. దాంట్లో ఉన్న నిజానిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఆడవారి కాలివేళ్లల్లో బొటన వేలు పెద్దగా ఉంటే అలాంటి వారు చాలా తెలివితేటలు, సృజనాత్మకత కలిగి ఉంటారు. వీళ్ళు ఎటువంటి కష్టమైన పనినైనా సరే చాలా సులభంగా చేస్తారు. ప్రతి పనిలో ముందుంటారు. వీళ్ళలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కొంత మందిలో కాలి మొదటి మూడు వేళ్ళు పొడవుగా ఉంటాయి, ఆ తర్వాత చివరి రెండు వేళ్ళు చిన్నగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు.

వీళ్ళు ఎలాంటి పని అయినా సరే తెలివితో చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే.. వీళ్ళు ధైర్యంగా ఉండడంతో పాటు ప్రక్క వారిని కూడా తమతో పాటు ధైర్యంగా ఉండేలా చూస్తారు. కొత్త వ్యక్తులతో చాలా తక్కువ సమయంలో సులువుగా కలిసిపోతారు. కొంతమందిలో బొటన వేలు తర్వాత నాలుగు వేళ్ళు సమానంగా ఉంటాయి.
ఇలాంటి వాళ్ళు కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు ఎదుటి వారు చెప్పే మాటలను విని వాటిని పాటించడానికి ప్రయత్నిస్తారు. అలాగే కాలి బొటనవేలు, పక్కనున్న వేలు బొటన వేలు కంటే చిన్నగా ఉంటే.. వారు జీవితాన్ని ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకు వెళ్తారు. అలాంటి వారు పని ఎంత భారంగా ఉన్న చాలా సులువుగా చేసేసుకుంటారు. ప్రేమించిన మనిషిని ఎంతో సంతోషంగా ఉంచుతారు.
