NTR30 Exclusive Updates : జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం NTR 30. RRR తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవ్వడంతో కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేయడం, తారకరత్న అకాల మరణంతో గతకొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న NTR 30 షూటింగ్ ఇటీవల ప్రారంభించారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ చిత్రంతో జాన్వీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా, యువసుధ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని, తండ్రీ, కొడుకుల పాత్రలో ఎన్టీఆర్ నటించనున్నాడు అని, ముఖ్యంగా తండ్రిగా యంగ్ టైగర్ గెటప్ ఓ రేంజ్ లో ఉంటుంది అని తెలుస్తోంది. తండ్రి పాత్ర ఈ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ లో రివీల్ అవుతుందని అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని బేగంపేటలో జరుగుతుంది.
Discussion about this post