Kiran Abbavaram : సినిమా రంగం అనేది ఒక క్రియేటివ్ ఫీల్డ్. ఎంతమంది వారసులు వచ్చినా టాలెంట్ లేనిదే ఇక్కడ ఎవరు నిలదొక్కుకోలేరు. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కో టాలెంట్. స్క్రీన్ పై కనిపించేందుకు కృష్ణానగర్ లో తిరిగే యువత తక్కువేం ఉండరు. ఒక్క అవకాశం.. ఒక్క అవకాశం అంటూ ఎక్కని ఆఫీస్ మెట్టు ఉండదు. వీటికి భిన్నంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.
టాలీవుడ్ లో సెల్ఫ్ మేడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్. ఇంతకు ముందు విడుదలైనవి కొన్ని చిత్రాలే అయినా.. ప్రస్తుతం పలు అగ్ర నిర్మాణ సంస్థలు అతనితో సినిమాలు నిర్మించేందుకు క్యూ కడుతున్నాయి. ‘రాజాగారు రాణివారు’తో హీరోగా పరిచయమైన కిరణ్ రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని ఆదరణ పొందాడు. అయితే మూడో చిత్రం ‘సెబాస్టియన్’ నిరాశ పరిచినా. అతని నాలుగో సినిమా ‘సమ్మతమే’ కి మంచి టాక్ వచ్చింది.
ఆ తర్వాత నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ ఫరవాలేదు అనిపించినా, మీటర్ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్లాప్ లు, యావరేజ్ మూవీస్ తో నెట్టుకొస్తున్నప్పటికీ ఈ కుర్రహీరోని వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కిరణ్కి కథలు అక్కర్లేదట. తన దగ్గరే బోలెడన్ని కథలు ఉన్నాయట. వాటితో సినిమాలు తీసుకొంటానని నిర్మాతలకు చెబుతున్నాడట.
ఎస్.ఆర్. కల్యాణమండపం స్క్రిప్టులో తన హ్యాండు బలంగా ఉంది. ఆ సినిమా హిట్టయ్యింది కదా? అందుకనే ఓ టీమ్ ని పెట్టుకొని వాళ్లతో కథలు రెడీ చేయిస్తున్నాడట. ఎవరైనా కథ చెప్పడానికి వస్తే నా దగ్గరే బోలెడు కథలున్నాయి. డైరెక్టర్ వస్తే చాలు అని నిర్మాతలకు చెప్తున్నాడట. అయితే ఇక్కడ దర్శకుడి క్రియేటివిటీకి ఛాన్స్ లేదు. హిట్ కొడితే మాత్రం.. ఆ క్రెడిట్ డైరెక్టర్ ఖాతాలోకి వెళ్తుంది. లేదంటే.. డైరెక్టర్ కెరీర్ రిస్క్ లో పడుతుంది. కిరణ్ కథలను ఓకే చేసి హిట్ కొట్టే డైరెక్టర్ ఎవరో చూడాలి.