The Experimental Science Fiction Film : ఏదైనా సినిమా రిలీజ్ కావాలంటే ఆరు నెలలు, సంవత్సరం, లేకుంటే రెండు, మూడు సంవత్సరాలు టైం పడుతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే సినిమా రిలీజ్ కావడానికి ఏకంగా 100 సంవత్సరాల టైం పడుతుంది. అదేం సినిమా రా బాబు అని ఆశ్చర్యపోతున్నారా..
ఇప్పుడు మనం చెప్పుకునే సినిమా చాలా విచిత్రమైంది. దానిని కనుక మనం చూడాలి అనుకుంటే అసలు చూడలేము. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి బహుశా మనమందరం చనిపోయి ఉంటాం. అదేంటి చనిపోయిన తర్వాత రిలీజ్ అయ్యే సినిమా.. అదేం సినిమా..
అప్పటివరకు ఆ సినిమా తీస్తూనే ఉంటారా.. అని మీకు ఆశ్చర్యంతో కూడిన డౌట్ రావచ్చు. ఇక అంత అద్భుతమైన, ఆశ్చర్యమైన సినిమా రిలీజ్ అయ్యేది 2115 వ సంవత్సరంలో, ఆ సినిమా పేరు “100 Years The Movie You will Never Seen.”ఇది ఒక ఎక్స్పరిమెంటల్ , సైన్స్ ఫిక్షన్ మూవీ. ఆల్రెడీ ఈ మూవీ 2015 లోనే కంప్లీట్ అయింది.
కానీ ఈ మూవీని హైటెక్ బుల్లెట్ ప్రూఫ్ బాక్స్ లో దాచి, లాక్ చేశారు .అది సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత 2115 నవంబర్ 18 వ తేదీన ఆటోమెటిక్ గా లాక్ ఓపెన్ అయ్యేలా సెట్ చేసారు.100 సంవత్సరాల తర్వాత మన టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో ముందే ఊహించి ఈ సినిమా తీశారు. 2115 తర్వాత ఆ లాక్ ను ఓపెన్ చేసి ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తారు.
బహుశా మనలో ఎవరం కూడా ఆ సినిమాను చూడలేము అనుకుంటా.. మన మాట అలా ఉంచితే, ఆ సినిమా కోసం పని చేసిన వాళ్లు కూడా బ్రతికి ఉండలేరు. ప్రతి సినిమా టీజర్ కి చివరిలో Coming Soon అని వస్తుంది కదా, కానీ ఈ సినిమాకు మాత్రం Not Coming Soon అని వస్తుంది.
Discussion about this post