Janasena Pressmeet in Thirupati : జగన్ పై, ఆయన ప్రభుత్వం పరిపాలన విధానంపై, ఆ పార్టీ నాయకులపై, తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ నిరసన తెలిపారు. ఓవైపు జగన్ కార్యకర్తలు ‘మా నమ్మకం నువ్వే జగన్’.. అనే పేరుతో ఇంటింటికి స్టికర్లు అంటిస్తూ ప్రచారం చేస్తుంటే..
మరోవైపు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా “మా నమ్మకం నువ్వే పవన్ “అంటూ జనసేన కార్యకర్తలు మరో అడుగు ముందుకు వేసి స్టిక్కర్లు అంటించి ప్రచారం మొదలెట్టారు. కిరణ్ రాయల్, సీఎం జగన్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ముందుగా జగన్ కి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రజల ముందు అమాయకుడిగా నటిస్తూ ,

కోట్ల ఆస్తులను కూడగట్టుకుంటూ ప్రజలను మోసం చేయడం ఒక్క జగన్మోహన్ రెడ్డి కె సాధ్యం అని ఎద్దేవా చేసారు. జగన్ అవినీతిని బట్టబయలు చేసేలా.. ఏడీఆర్-ఎలక్షన్ వ్యాచ్ నివేదికలో, దేశంలోనే రిచెస్ట్ సీఎంగా వైఎస్ జగన్ పేరు ఉందని.. అంతకంటే రుజువులు ఏమి అవసరం లేదని.. ‘ఆస్తులు జగన్‌కి అప్పులు ప్రజలకి’ మిగిలాయి అని.. ఇప్పటికైనా ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అని కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
జగన్ తండ్రి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు,తండ్రి ఆసరా తీసుకొని జగన్ వెనకనుండి ప్రజల సొమ్ము దోచుకొని, రారాజుగా వెలిగి.. నంబర్ వన్ అవినీతి పరుడిగా జైలు ఊచలు లెక్కపెట్టాడు. తిరిగి ఎలక్షన్స్ లాల్లో అదే అవినీతికి పాల్పడి సీఎం గా ఎదిగి తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని, అన్ని రోజులు జగన్ వే కాదు, బండారం బయట పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అని కిరణ్ రాయల్, జగన్ పై మండి పడ్డాడు.
