• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Political News

Vizag Steel Plant : రాజకీయాల చిక్కులో.. విశాఖ ఉక్కు..

* ఉక్కు తుక్కు అన్న రీతిలో ప్రవేటీకరణ వైపు మెగ్గు చూపిన కేంద్రం * అనూహ్య రీతిలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై వెనక్కి తగ్గిన కేంద్రం * ఆర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేస్తామన్న కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్

Sandhya by Sandhya
April 14, 2023
in Political News, Special Stories
0 0
0
Vizag Steel Plant : రాజకీయాల చిక్కులో.. విశాఖ ఉక్కు..
Spread the love

Vizag Steel Plant : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. ఈ నానుడి తో మనం విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో మొత్తం 32 మంది చనిపోయారు. అర్ధశతాబ్దం కిందట ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదంతో చేపట్టిన ఉద్యమంలో జరిగిన ఘటనది. ఆ తర్వాత మూడేళ్లకు కేంద్ర ప్రభుత్వం కర్మాగారం ఏర్పాటును ప్రకటించింది. 1971లో శంకుస్థాపన చేస్తే.. రెండు దశాబ్దాల తర్వాత పూర్తిస్థాయి పని ప్రారంభించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రస్తుతానికి ముందుకెళ్లడంలేదని, అంతకంటే ముందు ఆర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటించారు.

పూర్తిస్థాయి సామర్థ్యంలో స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలు సాగిస్తుందని, స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై ఆర్ఎన్ఐఎల్ యాజమాన్యంతోనూ, కార్మిక సంఘాలతోనూ చర్చిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం రాజకీయ ఒక ఎత్తుగడ. గత రెండేళ్ల కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతోంది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ జాబితాలో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. ప్లాంట్ ప్రయివేటీకరణను అన్ని పార్టీలు వ్యతిరేకించాయి.

తాజాగా స్టీల్ ప్లాంట్ లో బిడ్ దాఖలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, రాజకీయంగా వైసీపీ ప్రభుత్వంపైన ఒత్తిడి పెరిగింది. ఈ సమయంలోనే కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపైన విశాఖ వేదికగా తమ తాజా నిర్ణయం వెల్లడించడం వెనుక తమ ఎత్తుగడ పనిచేసిందని బి.ఆర్.యస్ నాయకులు ఈ క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకున్నారు. మళ్ళీ తెరపైకి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇప్పుడు కడప ఉక్కు కర్మాగారం కోసం కూడా మళ్లీ ఆ స్థాయి పోరాటం చేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు పిలుపునిస్తున్నాయి.

కానీ.. ఈ పిలుపు వెనుక ఉక్కు పరిశ్రమ సాధించటం కన్నా రాజకీయ ప్రయోజనాల మీదే పార్టీలు దృష్టి కేంద్రీకరించాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాటి ఉద్యమంలో నిజాయితీ ఉంది. నేటి పిలుపు రాజకీయాలతో కున్నదన అభిప్రాయం ఈ విమర్శలకు అద్దం పడుతోంది. డిసెంబర్ 2021 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దీక్షకు దిగారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ దీక్ష చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు 300 రోజులకు పైగా ఆందోళన చేస్తున్నారు. కార్మికులకు నైతికంగా మద్దతు ఇచ్చేందుకు పవన్‌ కల్యాణ్ ఈ దీక్షను చేపట్తి ఉక్కు సంకల్పంతో ఈ సమస్య సానుకూల స్పందనకై అప్పటినుంచే వ్యూహరచన చేసి రాష్టంలోని ఆధికార పక్షానికి గుబులు పుట్టించారు.

కేం ద్ర హోమ్ శాఖ మం త్రి అమిత్ షాని కలిసి.. విశాఖ ఉక్కు తో తెలుగు ప్రజలకున్న బంధాన్ని తెలియచేసి, ఈ పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని పలుమార్లు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి బి.జె.పి పెద్దలను వినతిపత్రాలు సమర్పించారు ఈ విశాఖ స్టీల్ ప్లాం ట్‌ను ఇప్ప టికిప్పు డు ప్రైవేటుపరం చేయాలనుకోవడం లేదని, దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదని ప్రకటన చేయడం హర్షణీయమని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎం దరో రైతులు తమ భూములను త్యాగం చేశారని.. ఇందులో కొందరికి ఇప్ప టివరకూ సెటిల్మెం ట్ కాలేదని చెప్పారు.

ఇలాంటి పరిశ్రమపై రాష్ట్ర పాలకులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని.. కానీ వారికి మొదటి నుంచి చిత్తశుద్ధి లోపించిందని విమర్శించారు. జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మి కులకు మద్దతుగా నిలవడం తోపాటు భారీ బహిరంగ సభ నిర్వ హిం చి విశాఖ ఉక్కు ను పరిరక్షించాలని బలంగా చెప్పామని పవన్ కళ్యాణ్ తెలిపారు. సమస్యలపై పోరాటానికి జనసేన కార్యాచరణకు ఉదాహరణ ఎవరి ఎత్తు గడలు ఎలావున్నా కేంద్రం ఈ సమస్యపై అలోచించడం శుభపరిణామం. రాష్ట్రానికి ఎన్నికల తాయిలంగా ఖాయంగా ఓ సాకుకూల ప్రకటన రావచ్చు అని ఆశిద్దాం. రాష్ట్రప్రగతిని కాంక్షిద్దాం..


Spread the love
Tags: ApPoliticsBJP PartyBRSJanasenaKtrPawanKalyanTelanganaVizag NewsVizag Steel PlantVizagBeachVizagSteelPlantMovementVizagSteelPlantPrivatization
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.