Directors Remuneration : ఓ సినిమా హిట్ అవ్వాలన్నా, లేక ఓ హీరోకు స్టార్ ఇమేజ్ రావాలన్న డైరెక్టర్ మాత్రమే చేయగలడు. అయితే మన దేశంలో నటుల కంటే డైరెక్టర్స్‌కు పాపులారిటీ తక్కువ, పాపులారిటే కాదు రెమ్యూనరేషన్ కూడా తక్కువే ఉంటుంది. అయితే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్టర్స్ స్థాయిని పెంచాడని చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది డైరెక్టర్స్ హీరోలకు ధీటుగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
* రాజమౌళి :
టాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటారట.
* సుకుమార్ :
పుష్ప మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ మారిన ఒక్కో సినిమాకి 40 నుంచి 50 కోట్లు అందుకుంటారట.
* త్రివిక్రమ్ శ్రీనివాస్ :
మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కో మూవీకి 35 నుంచి 40 కోట్లు తీసుకుంటారట.
* కొరటాల శివ :
కమర్షియల్ డైరెక్టర్ శివ కొరటాల ఒక్కో సినిమాకు 25 కోట్ల నుంచి 30 కోట్లు తీసుకుంటారట.
* వంశీ పైడిపల్లి :
మరో సూపర్ హిట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఒక్కో చిత్రానికి 20 నుంచి 25 కోట్లు అందుకుంటారట.
* అనిల్ రావిపూడి :
వరుస చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి 20 నుంచి 25 కోట్లు ఛార్జ్ చేస్తారట.
* బోయపాటి శ్రీను :
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఒక్కో మూవీకి 20 నుంచి 25 కోట్ల అందుకుంటారట.
* సందీప్ వంగ :
అర్జున్ రెడ్డితో టాలీవుడ్ ని, కబీర్ సింగ్ తో బాలీవుడ్ ని షేక్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి 10 కోట్ల నుంచి 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారట.
Discussion about this post