• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త శ్రీ తిరునగరి రామానుజం : కేసీఆర్

TrendAndhra by TrendAndhra
August 15, 2020
in Latest News
0 0
0
తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త శ్రీ తిరునగరి రామానుజం : కేసీఆర్
Spread the love

తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త శ్రీ తిరునగరి రామానుజం అని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అభినందించారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలుస్తారని సీఎం అభిప్రాయపడ్డారు. మహాకవి దాశరథి పురస్కారం – 2020 ని ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతి భవన్ లో రామానుజంకు అందించారు. శాలువా కప్పి సన్మానించారు. జ్ఞాపిక, రూ.1,01,116 నగదు పురస్కారం అందించారు.

దాశరథి పురస్కారానికి రామానుజం వందకు వంద శాతం అర్హుడని సీఎం అన్నారు. రామానుజం రాసిన బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం లాంటి రచనలు ఎంతో ఆదరణ పొందాయని చెప్పారు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండడంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితీవేత్తగా రామానుజం నిలుస్తారని అభినందించారు.

రామానుజం మరిన్న రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ఆకాంక్షించారు. ఆ కార్యక్రమంలో ఎంపి శ్రీ కె. కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ శ్రీనివాస రాజు, డైరెక్టర్ మామిడి శ్రీ హరికృష్ణ, సిఎం ఓఎస్డీ శ్రీ దేశపతి శ్రీనివాస్, రామానుజం కుమారుడు శ్రీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామానుజం ఓ పద్యం రాసి, పాడి వివినిపించారు.
‘‘శ్రీ తెలంగాణమును
శ్రీ ఖండమును సేయ
అవతరించిన యెట్టి
అపర విష్ణుడవీవు
తెలగాణమున
కోటి ఎకరాలు పారించి
పంట భూమిగ మార్చ
ప్రతిన బూనిన యట్టి
రైతు స్వామివి నీవు
జాతి నేతవు నీవు
శ్రీ కల్వకుంట్ల
క్షీరాబ్ధి చంద్రమా
శ్రీ రస్తు
శ్రీ చంద్రశేఖరా
తెలంగాణ దీపమా
విజయోస్తు’


Spread the love
Tags: కేసీఆర్తెలంగాణా
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.