Asalu Movie Review : నటీనటులు: రవిబాబు, పూర్ణ, సూర్య, సత్య కృష్ణన్, ప్రణవి మనుకొండ
దర్శకులు : ఉదయ్, సురేష్
నిర్మాతలు: రవి బాబు
సంగీతం : ఎస్ ఎస్ రాజేష్
సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని
ఎడిటర్: సత్యనారాయణ బల్లా
ఓటీటీ స్ట్రీమింగ్ : ఈటీవీ విన్
అల్లరి మూవీతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు రవిబాబు. తాజాగా క్రైమ్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీగా రూపొందిన అసలు మూవీ ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఈటివి విన్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ:
వెంకటేష్ చక్రవర్తి (సూర్య) ఒక సుప్రసిద్ధ పాథాలజీ ప్రొఫెసర్, కాగా వందన (పూర్ణ) ఆయన దగ్గర అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంటుంది. అయితే ఒకరోజు ఆన్లైన్ క్లాస్ తీసుకుంటుండగా వెంకటేష్ చక్రవర్తి హత్యకు గురవుతాడు. అది చూసి స్టూడెంట్స్ మరియు వందన ఒక్కసారిగా షాక్ అవుతారు. అనంతరం ఈ కేసు చేధించే బాధ్యతను సీఐడీ అధికారి రంజిత్ రావు (రవిబాబు) కి అప్పగిస్తుంది ప్రభుత్వం.
అయితే హత్య జరిగిన రోజు నలుగురు వ్యక్తులు మరియు ఒక గుర్తుతెలియని ముసుగు వ్యక్తి ప్రొఫెసర్ నివాసానికి వస్తారు. మరి వీరిలో ప్రొఫెసర్‌ను ఎవరు చంపారు? అసలు హంతకుడి ఉద్దేశ్యం ఏమిటి? ఆయనకు వందన ఎలా సహకరించింది? కేసుని ఫైనల్ గా రంజిత్ రావు ఛేదించాడా లేదా అనే ప్రశ్నలకు సమాధానాలు కావలి అంటే సినిమా చూడాల్సిందే..
రివ్యూ :
మర్డర్ మిస్టరీ సినిమాల్లో నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుందన్నది ప్రేక్షకుల ఊహలకు అందకూడదు. సర్ప్రైజింగ్ ట్విస్ట్‌లతో ఆడియెన్స్‌ను చివరి వరకు హోల్డ్ చేయాలి. వారి అటెన్షన్ కథ నుంచి మళ్లకుండా చేయగలగాలి. అప్పుడే ఈ జోనర్ సినిమాలు మెప్పిస్తాయి. అసలు మూవీ కథలో అలాంటి మెరుపులు పెద్దగా లేవు.
కంప్లీట్‌గా అవుట్‌డేటెడ్ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకులు ఉదయ్, సురేష్. మొత్తంగా చూసుకుంటే క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన అసలు మూవీ కేవలం పర్వాలేదనిపిస్తుంది. సెకండ్ హాఫ్ తెరకెక్కించిన విధానం ఆకట్టుకోదు, అయితే రవిబాబు, పూర్ణ ల యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇంట్రెస్టింగ్ సీన్స్ దీనికి ప్రధాన బలం.
ప్లస్ పాయింట్స్ :
* రవిబాబు, పూర్ణ, సూర్య
* ద్వితీయార్ధం
మైనస్ పాయింట్స్ :
* రొటీన్ క్రైమ్ డ్రామా
* బలమైన ఎమోషన్స్ లేకపోవడం
రేటింగ్ : 2.5/5
ట్యాగ్ లైన్ : అసలు అవుట్‌డేటెడ్ పాయింట్‌తో సాగే సాదాసీదా మర్డర్ మిస్టరీ మూవీ.
Discussion about this post