Beatriz Flamini : ఒంటరితనం మనిషిని ఒక అగాధం లోకి తీసుకెళ్తుంది. ఆ ఒంటరి తనం నుండి బయటపడాలంటే చాలా కాలమే పడుతుంది. ఆ ఒంటరితనం అనేది ఎలా ఉంటుందో అనుభవించడానికి స్పెయిన్ కి చెందిన ఓ మహిళ ప్రయత్నం చేసింది. ఆమెకు ఆలోచన వచ్చిందే తడవుగా దానికి కార్యరూపం కూడా చేసింది.
230 అడుగుల లోతున్న ఓ గుహలో 500 రోజులు ఒంటరిగా జీవించి అందర్నీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. శుక్రవారం రోజు సురక్షితంగా బయటికి వచ్చింది. సాహసవంతమైన ఆ మహిళ 50 ఏళ్ళ ఫామిలీ. ఆమె ముందునుండే అథ్లెట్, పర్వతారోహకురాలు. ఫామిలికి ఒంటరిగా ఒక గుహలో ఉంటే ఏం జరుగుతుందో అనే ఆలోచన వచ్చింది. 2021 నవంబర్ 21న కొంతమంది సభ్యుల సహాయం తీసుకుని గుహలోకి అడుగు పెట్టింది.
ఆమెకు అవసరమైన వస్తువులన్నీ గుహ బయట నుంచి ఆ బృందం సమకూర్చే వాళ్ళు. ఆహారం, నీళ్లు ఆమెకు అందించే వాళ్ళు ఆమె దగ్గర రెండు కెమెరాలు, మైకులు అమర్చి వాటి ద్వారానే ఆమె సురక్షితంగా ఉందా, లేదా తెలుసుకునేవారు. ఆమెకు బయట ప్రపంచంతో సంబంధాలు లేవు. ఆమె ఎవరితో మాట్లాడేది కాదు .ఆ మైక్ ద్వారా ప్రతిరోజు తన అనుభవాన్ని పంచుకునేది.
గుహలో ఆమె పుస్తకాలు చదువుతూ, హ్యాండ్ కర్చీఫ్స్ తయారు చేస్తూ కాలాన్ని గడిపింది. ఆ గుహలో సమయం ఎంత అవుతుందో కూడా తెలుసుకోవడం కష్టంగా ఉండేది. తర్వాత కొన్ని రోజులకు తాను రోజులు కూడా లెక్కించడం ఆపేశానని ఆమె తెలిపింది. గుహ నుంచి బయటికి రాగానే తన టీం దగ్గరికి వెళ్లి హ్యాపీగా అందరిని హగ్ చేసుకుని తన సంతోషాన్ని పంచుకుంది.
ఈ దృశ్యాన్ని మొత్తం స్పానిష్ కు చెందిన ఒక టీవీ చానల్ ఆ వీడియోను విడుదల చేసింది. అత్యధికంగా గుహలో కాలం గడిపిన వ్యక్తిగా ఆమె ప్రపంచ రికార్డును సృష్టించింది. కానీ ఇంకా ఆమె పేరు గిన్నిస్ బుక్ పరిగణలోకి తీసుకొలేదు.