Geeta Rabari : సినిమాలల్లో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలా పాట ఆ సినిమాలో హిట్ కొడితే ఆ పాటను ‘కోటి రూపాయల పాట’ అనడం మనం చూస్తూనే ఉంటాము.” గీతా రబరి” అనే గాయని ఈ మాటలను నిజం చేసి చూపించింది. గీతా రబరి ని “కచ్ కోయిల”అని కూడా పిలుస్తారు.
కచ్ జిల్లాలోని ఒక గ్రామంలో జన్మించిన గీతకు అయిదవ తరగతి నుంచే భజనలు, జానపదాలు పాడడం అబ్బింది. ‘రోమా సేర్మా’ పాటతో జిల్లావ్యాప్తంగా ఆమె పేరు తెచ్చుకుంది.గుజరాత్ జిల్లాలో రాపర్ పట్టణంలో ఒక రాత్రి మొత్తం పాటల కచేరి నిర్వహించింది “గీతా రబారి”.

ఆ కచేరిలో భజన పాటల దగ్గర నుంచి జానపదాల వరకు ఎన్నో ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.ఆమె గాత్రానికి మైమరచిపోయిన ప్రేక్షకులు, నోట్లు వెదజల్లుతూనే ఉన్నారు. కార్యక్రమం ముగిసేసరికి ఆమెకు వచ్చిన నోట్ల విలువ నాలుగు కోట్ల పైనే. గీతపై నోట్ల వర్షం కురిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
