Surya Grahanam : సూర్యగ్రహణం ఈ సంవత్సరం ఏప్రిల్ 20 గురువారం అమావాస్య రోజున ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఉదయం 7.05 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 గంటల వరకు అంటే 5 గంటల 25 నిమిషాల పాటు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది.అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు.
ఈ గ్రహణ ప్రభావం ముఖ్యంగా కొన్ని రాశుల వారి పైన ఉండే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
మేష రాశి :మేష రాశివారి మీద ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు సూర్యగ్రహణం రోజు శుభకార్యాలు కానీ, కొత్త పనులు ప్రారంభించడం, కొత్త వస్తువులు కొనడం అస్సలు చేయకూడదంట. గ్రహణం ప్రభావంతో ఈ రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
వృశ్చిక రాశి : ఈ రాశి వారికి గ్రహణ ప్రభావంతో ఆర్థిక సమస్యలు, అధిక ఖర్చులు కానున్నాయంట. చిన్న ,చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉండడంతో ప్రతీ విషయంలో ఆచీ ,తూచీ అడుగు వేయాలి.వీరు శివనామస్మరణ చేయడం మంచిదని పండితులు చెపుతున్నారు.
కన్యరాశి: ఈ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త పడాలి.కొత్త పనులు ప్రారంభించక పోవడమే మంచిది. వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతాయి.
మకర రాశి :ఈరాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వీరికి ఆర్ధిక సమస్యలు, ఖర్చులు కూడా అధికం కానున్నాయి. చేయాలనుకున్న పనులు కూడా పూర్తి కావు. కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది.