Beauty Tips : ఈరోజుల్లో చాలా మంది అందంగా కనిపించడం కోసం చేయని ప్రయత్నాలు లేవు..ముఖ్యంగా అమ్మాయిలు అందం విషయంలో చాలా కేర్ చూపిస్తారు. ఆ అందంలో ఒక భాగం కేశాలు..జుట్టు స్మూత్ గా, సిల్కిగా, ఉండడానికి ఇప్పుడు మార్కెట్ లో చాలా రకాల హెయిర్ ట్రీట్మెంట్ లు అందుబాటులో ఉన్నాయి.
దానికోసం ప్రజలు ఎంత డబ్బైనా పెట్టడానికి రెడీగా ఉన్నారు. అయితే ఈ హెయిర్ ట్రీట్మెంట్ లన్నీ కూడా రసాయనాలతో కూడుకున్నవి. అవి జుట్టుకు చాలా హానికరం. అయినా కూడా జుట్టు అందంగా కనిపించడం కోసం ప్రత్యామ్నయాలు వెతకకుండా ఆ ట్రీట్మెంట్ల వైపే జనాలు మొగ్గు చూపుతున్నారు.
అందం, సిల్కి హెయిర్ విషయంలో కొరియన్ ప్రజలు ఒక అడుగు ముందే ఉన్నారు.వారి అందం వెనుక ఉన్న రహస్యం ఏంటో చూద్దాం..జుట్టు సంరక్షణ కోసం మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం నుండి మంచి “హెయిర్ కెరాటీన్ మాస్క్” ను తయారు చేసుకోవచ్చు. దీని వల్ల మన జుట్టు సిల్కీగా, స్ట్రెయిట్ హెయిర్ గా తయారవుతుంది.
కేరాటీన్ మాస్క్ తయారు చేయడానికి కావలసినవి… కొబ్బరి నూనె ఒక టీ స్పూన్, ఆలివ్ నూనె, పాత బియ్యం, గుడ్డు లోని తెల్లసొన. కేరాటిన్ మాస్క్ తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని మాష్ చెయ్యాలి.దాంట్లో గుడ్డులోని తెల్లసొన కలుపుకోవాలి. వాటితో పాటు ఆలివ్, కొబ్బరి నూనె వేసి కలపాలి.
మెత్తటి పేస్ట్ చేసుకోవడానికీ మిక్సి పట్టుకోవడం మంచిది. ఆ తర్వాత ఆ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేసి.అరగంట బాగా ఆరిన తర్వాత. సహజమైన షాంపుతో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మీ జుట్టు చాలా స్మూత్ గా, సిల్కీగా,అవుతుంది.
బియ్యం జుట్టుకు చాలా మేలు చేస్తాయి. కొరియన్ ప్రజల చర్మం, జుట్టు కూడా చాలా మెరుస్తూ ఉంటాయి. కొరియన్ ప్రజల అందం రహస్యం ఇదే. బియ్యంలో ఉండే విటమిన్ B ,విటమిన్ E చర్మం మరియు జుట్టును మెరిసెలాగా చేస్తాయి.
అనవసరమైన చికిత్సల జోలికి వెళ్లకుండా ఇలా సహజ సిద్ధమైన రెమెడీలు చేసుకొని జుట్టుని సంరక్షించుకోవడం ఉత్తమం. ఈ పేస్టు తయారు చేసుకుని ఒక జుట్టుకు మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు వచ్చి అందం మీ సొంతం అవుతుంది. .