Shriya Saran Chiranjeevi : సౌత్ ఇండియాను దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా ఏలింది శ్రియా సరన్. మంచి నటన, అద్భుతమైన డాన్స్ స్కిల్స్ ఆమెను స్టార్ ని చేశాయి. 2001లో ఇష్టం మూవీతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది శ్రియా. అది హిట్ అవ్వడంతో వెంటనే నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది. 2002లో విడుదలైన సంతోషం మూవీతో ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంది. అదే ఏడాది చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే ఇలా వరుస హిట్స్.. దీంతో తక్కువ కాలంలోనే స్టార్ హోదా తెచ్చిపెట్టాయి.
తద్వారా హ్యుజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నిలిచింది. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే దేవదాసు, తులసి వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కి స్టెప్పులేసింది. ఇక ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్తో అలరించేందుకు సిద్ధమయ్యింది హాట్ బ్యూటీ శ్రియ. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘ఠాగూర్’ చిత్రంలో చిరు సరసన శ్రియ హీరోయిన్‌గా నటించింది. నటనతో పాటు చిరుతో సమానంగా స్టెప్పులు వేసి అదరహో అనిపించుకుంది.
తాజాగా శ్రియ మరోసారి మెగాస్టార్ చిరుతో మాస్ స్టెప్పులు వేయనుంది. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రంలోని ఐటం సాంగ్ కోసం శ్రియను సంప్రదించినట్లు తెలుస్తోంది. అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ స్పెషల్ సాంగ్ కోసం కోటి డిమాండ్ చేసినట్టు సమాచారం. నాలుగు పదుల వయసులోనూ ఇప్పటి కుర్ర హీరోయిన్లకు గ్లామర్ షోతో గట్టిపోటీ ఇస్తుంది శ్రియ.