Dasara Movie OTT Release Date : నేచురల్ స్టార్ నాని, స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ధూమ్ ధామ్ చేసింది. తెలంగాణలోని గోదావరిఖని బొగ్గు గనుల ప్రాంతంలోని ఓ పల్లెలో జరిగిన కథతో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి,
నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించిన దసరా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. దసరా సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు రూ. 22 కోట్లకు దసరా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఏప్రిల్ 27 నుంచి డిజిటల్ వేదికపై ప్రసారం కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ స్వయంగా ట్విటర్ వేదికగా ప్రకటించింది. మీరు ఊహించిన దానికంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. థియేటర్ల నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి ఒక రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.
https://twitter.com/OTTGURU1/status/1648871040234455041?t=me-Iu5TD1Pm8exh6kqWDMg&s=19
Discussion about this post