Samyuktha menon gift to virupaksha director : సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా ఈ మూవీకి కార్తీక్ వర్మ దండు దర్శకుడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించగా.. SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్వహించారు. ఇందులో తేజ్ నటన.. కార్తీక్ దండు టేకింగ్ సినీ ప్రియులను కట్టిపడేశాయి. గతవారం విడుదలైన ఈ చిత్రం ఇంకా కాసుల వర్షం కురుపిస్తూనే ఉంది.
ఇదిలావుండగా ఏదైనా మూవీ హిట్ అయితే డైరెక్టర్ కు నిర్మాతనో, హీరోనో డైరెక్టర్ కు గిఫ్టులు ఇస్తుంటారు కానీ ఇక్కడ మాత్రం డైరెక్టర్ కు హీరోయిన్ గిఫ్ట్ ఇచ్చింది. డైరెక్టర్ కార్తీక్ కు హీరోయిన్ సంయుక్త మీనన్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది. ఈ మూవీ విడుదల రోజు మూవీ టీం మొత్తం సినిమా చూసేందుకు ఒక థియేటర్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈక్రమంలో డైరెక్టర్ ఫోన్ ని ఎవరో కొట్టేశారు. దీంతో విషయం తెలిసిన సంయుక్త కార్తిక్ వర్మ దండుకు వెంటనే ఐఫోన్ ప్రో మోడల్ ని గిఫ్టుగా ఇచ్చింది.
దీనిపై సంయుక్త మాట్లాడుతూ.. “విరూపాక్ష సినిమా హిట్ అయిన సందర్భంగా డైరెక్టర్ కార్తిక్ వర్మకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను. ఆ టైమ్ లోనే కార్తిక్ ఫోన్ పోయిందని తెలిసింది. వెంటనే ఐఫోన్ కొనిచ్చానని తెలిపింది. దీంతో హీరోయిన్ చేసిన పనిని తెగ పొగిడిస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అంటూ సంయుక్తను ప్రశంశిస్తున్న విషయం తెలిసిందే.
Discussion about this post