Akhil Akkineni Agent : ఎవరు ఏ పని చేయాలో, ఏది వచ్చో అదే చేయాలి. అలా కాదని అందులో ఇందులో వేళ్ళు పెట్టడం, రెండు పడవల మీద ప్రయాణం ఎప్పటికైనా ప్రమాదమే! ఇదీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా వర్తిస్తుంది. ఒకప్పుడు దర్శకదిగ్గజం దాసరి, ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు వివిధ శాఖల్లో పని చేస్తూ కూడా సూపర్ హిట్లు అందుకున్నారు. కానీ అప్పటి పరిస్థితులు పూర్తి భిన్నం. కథలు, మాటలు, స్క్రిప్ట్ రాసే వాళ్ళు సెపరేట్ గా ఉండే వాళ్ళు.
అయితే నేటితరం డైరెక్టర్స్ మాత్రం ప్రొడక్షన్ తో సహా అన్నింటిలో తమ హస్తం ఉండాలని తహతహలాడుతున్నారు. ప్రొడక్షన్ లో ఎక్కువ ఇన్వాల్వ్ కావడంతో మొదటికే మోసం వస్తుంది. మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దిల్ రాజు తన కెరీర్ పెద్ద ఝలక్ ఇచ్చింది అని చెప్పిన శాకుంతలంలో అధిక వాట డైరెక్టర్ గుణశేఖర్ దే. అలాగే ఆచార్య డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ నష్టాలను పూడ్చుకోవడానికి NTR30 స్క్రిప్ట్ ను కొన్నాళ్ళు పక్కన పెట్టిన విషయం తెలిసిందే.
అనంతరం వచ్చిన పాన్ ఇండియా మూవీ లైగర్ పూరి జగన్నాథ్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్ మెంట్ ఓవరాల్ గా సినిమాపై దెబ్బ పడింది. ఇక తాజాగా వచ్చిన ఏజెంట్ విషయంలోనూ ఇదే జరిగింది. ప్రొడ్యూసర్ అనిల్ సుంకరతో పాటు డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా నిర్మాణ భాగస్వామ్యం తీసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ చూస్తుంటే మాత్రం సీన్ రిపీట్ అయినట్టే కనిపిస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలున్నాయి కానీ ప్రొడ్యూసర్ ఇచ్చే రెమ్యునరేషన్ కంటే భాగస్వామ్యం ద్వారానో లేదా ఏరియాల వారిగా హక్కులు కొనేసుకోవడం ద్వారానో ఎక్కువ సొమ్ము వస్తుందని డైరెక్టర్స్ అత్యాశకుపోవడంతోనే అసలు సమస్య. హిట్ కొట్టే దమ్మున్న డైరెక్టర్స్ ఖాతాలో డిజాస్టర్స్ చేరుతున్నాయి. అందుకేనేమో బోయపాటి, అనిల్ రావిపూడి రిస్కులకు దూరంగా ఉండి రికార్డులు కొల్లగొడుతున్నారు.
Discussion about this post