రాంగోపాల్ వర్మ చాలా తెలివైన దర్శకుడు. కానీ ఆయన ఆ తెలివితేటల్ని జనాల్ని ఫూల్స్ ని చేయడానికి వాడుతున్నారు. అయితే ఈసారి మాత్రం రివర్స్ లో జనాలు ఆయన్ని ఫూల్ ని చేశారు.
తాజాగా ఆయన రిలీజ్ చేసిన థ్రిల్లర్ మూవీ కి అనుకున్నంత వ్యూస్ రాలేదనీ, చాలా తక్కువ స్థాయిలో వ్యూస్ వచ్చాయని తెలుస్తుంది. ట్రైలర్స్ లో తప్ప సినిమాలో విషయం ఉండటం లేదని గ్రహించిన జనాలు ఈసారి కేవలం ట్రైలర్ మాత్రమే చూసి సినిమాని లైట్ తీసుకున్నారు. ప్రతిసారి జనాల్ని ఫూల్స్ ని చేయడం కుదరదని ఆయన ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.