RC16 Update : RRR మూవీ అనంతరం గ్లోబర్ స్టార్ అయ్యాడు రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ పూర్తయిన వెంటనే స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు చరణ్. చరణ్ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఏ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో కలిసి పనిచేయడానికి సిద్ధం అయ్యాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బుచ్చిబాబు
మొదటి సినిమాతోనే 100కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇటీవల RC16 గురించి చరణ్ మాట్లాడుతూ రంగస్థలానికి మించి ఉంటుంది అనడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా అని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం గురించి ఇప్పటికే రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం RC16లో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడనున్నాడు.
దీనికోసం చరణ్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడని తెలుస్తోంది. అతను తన బాడీ లాంగ్వేజ్‌పై కూడా ఫోకస్ చేయనున్నాడట. అయితే డైరెక్టర్ బుచ్చిబాబు రంగస్థలం మూవీకి AD గా వర్క్ చేశాడు కాబట్టి చెర్రీ నుంచి బెస్ట్ వర్క్ పొందడానికి ఉపయోగపడొచ్చు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.