Naga Chaitanya Custody Movie : మొన్న భారీ అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర నిరాశ మిగిల్చింది. అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏజెంట్. మొదటిసారి అఖిల్ పూర్తిగా మాస్, యాక్షన్ మూవీతో వచ్చాడు. అనుకున్న స్థాయిలో ఈ మూవీ సక్సెస్ కాలేకపోయింది. దీనికి తోడు గత కొంతకాలంగా అక్కినేని ఫ్యామిలీకి సరైన హిట్ పడలేదు.
అయితే ఇప్పుడు అందరి చూపు చైతూ కస్టడీపైన ఉంది. అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాగ చైతన్య. హిట్లు, ప్లాప్ లు అని చూడకుండా వరుస సినిమాలను చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. చైతూ మే 12న కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పోలీస్ డ్రామా తాలూకు ప్రమోషన్లు ఇంకా ఊపందుకోలేదు.
తమ్ముడి సినిమానే కాబట్టి ఏజెంట్ హడావిడి అయ్యాక స్టార్ట్ చేద్దామని చైతూ సూచించడంతో టీమ్ ఆగిపోయింది. కానీ ఒక్క రోజుకే ఏజెంట్ సీన్ మారిపోయింది. కస్టడీ ప్రీ టాక్ పాజిటివ్ గానే ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తున్న అంశాలు లేకపోలేదు. దీనికి దర్శకుడు వెంకట్ ప్రభు. మొదటిసారి టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ ఇది ఫలితం ఎలా ఉంటుందో అని అనుమానం లేకపోలేదు. దీనికి తోడు హీరోయిన్ కృతి శెట్టికి వరస డిజాస్టర్లలో ఉంది.
కస్టడీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తెలుగులో యావరేజ్ ఆల్బమ్ ఇచ్చి చాలా కాలమైంది. సో ఈరకంగా కస్టడీపై ఒత్తిడి మరింత పెరిగింది. అక్కినేని ఫ్యామిలీలో థాంక్యూ, ది ఘోస్ట్, ఏజెంట్ రూపంలో హ్యాట్రిక్ డిజాస్టర్లు పడ్డాయి. సో దీన్ని కస్టడీ బ్రేక్ చేయాలి. ఏజెంట్ ఫలితం చూసిన అక్కినేని అభిమానులు అంతా చైతూపైనే ఆశలు పెట్టుకున్నారు. దీని ఫలితం ఎలా ఉంటుందో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Discussion about this post