Jr NTR Birthday Special : మన టాలీవుడ్ లో స్టార్ హీరోల బర్త్ డేలు వస్తున్నాయంటే చాలు ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. ఒక నెల ముందు నుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తారు. బర్త్ డే సందర్భంగా వచ్చే గ్లిమ్స్, పోస్టర్స్ తో యూట్యూబ్.. ట్యూబ్ పగిలిపోతుంది. ట్విట్టర్ లో ఆ రోజంతా ట్రెండింగ్ ఆ స్టార్ హీరోనే హాట్ టాపిక్. తాజాగా రామ్ చరణ్, అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా వచ్చిన సాలిడ్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇక త్వరలో మరో టాలీవుడ్ టాప్ హీరో అయిన
తారక్ బర్త్ డే దగ్గర పడుతుండటంతో క్రేజీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉండడంతో మేకర్స్ కూడా భారీగానే ప్లాన్స్ చేస్తున్నారు. మొదటగా కొరటాల శివతో చేస్తున్న NTR30 నుంచి ఫస్ట్ లుక్ గానీ, టైటిల్ గానీ ఏదోటి పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే NTR31కి సంబంధించి కూడా మరో అప్డేట్ రానుంది. వీటికి తోడు ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ “వార్ 2” నుంచి కూడా ఓ అఫిషియల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఇక ఫైనల్ గా యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా కెరీర్లోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ‘సింహాద్రి’ మూవీని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు రెడీ అవుతోంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ మీద ‘సింహాద్రి’ సినిమాను ప్రదర్శించబోతున్నారు. నిజం చెప్పాలంటే ‘సింహాద్రి’ రీ-రిలీజ్ కన్నా ఈ సినిమా మెల్బోర్న్ ఐమ్యాక్స్ స్క్రీన్ మీద ప్రదర్శితమవ్వబోతోంది అనే విషయమే అభిమానులకు ఎక్కువ కిక్ ఇస్తుంది.
Discussion about this post