Pushpa 2 Audio Rights : ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న మోస్ట్ అవెయిటెడ్ ఇండియన్ మూవీస్‌లో ‘పుష్ప2’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ సక్సెస్ పుల్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎంతటి సంచలన విజయం సాధించింతో అందరికీ తెలిసిందే. సుకుమార్ టేకింగ్, బన్నీ పెర్ఫామెన్స్, రష్మిక మందన్న గ్లామర్‌తో పాటు దేవిశ్రీ ప్రసాద్ పాటలకు యావత్ దేశం ఫిదా అయింది. ఈ నేపథ్యంలోనే సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెరిగిపోగా.. హిందీ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.
ఈ సినిమా ఇచ్చిన ఫలితంతో దీనికి బూస్టింగ్ ఇచ్చేందుకు సుకుమార్ దీనికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే ఈ మూవీకి భారీ ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అయితే ఈ మూవీ ఆడియో రైట్స్ ఏకంగా రూ. 65 కోట్ల భారీ ధరకు ప్రముఖ మ్యూజిక్ సంస్థ టి సిరీస్ దక్కించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజం అయితే ఇప్పటి వరకు భారతీయ చిత్రాల్లో ఇదే అత్యధికమని తెలుస్తోంది.
గతంలో RRR చిత్రం రూ. 25 కోట్లు, సాహో మూవీ రూ. 22 కోట్లు, ‘బాహుబలి 2’ రైట్స్ రూ. 10 కోట్లకు అమ్ముడయ్యాయి. వీటన్నిటితో పోలిస్తే.. భారీ మొత్తం దక్కించుకున్న ‘పుష్ప2’ థియేట్రికల్ కలెక్షన్లలోనూ టాప్ ప్లేస్‌కు చేరుకుంటుందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. నిజానికి పుష్ప పార్ట్ 1 సౌత్ కంటే కూడా నార్త్ లోనే ఎక్కువ వసూలు చేసింది. ఆ ఫలితమే ఇప్పుడు ఆడియో హక్కుల రూపంలో కనిపిస్తోంది.