GopiChand RamaBanam : రామబాణం.. నటుడిగా గోపీచంద్‌కి ఇది 30వ సినిమా. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ తర్వాత దర్శకుడు శ్రీవాస్- గోపీచంద్ కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ క్రేజీ కాంబినేషన్ ‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నేపథ్యంలో, రచయిత భూపతిరాజా రాసిన కథ ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమానికి హాజరయ్యారు. సినిమా విశేషాలు గోపీచంద్‌ను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ.. ‘రామబాణం’ పేరు బాగుంటుందంటూ ఆ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు.
ఇలా ప్రముఖ హీరో.. మరో హీరో సినిమాకి టైటిల్ పెట్టడం అరుదైన విషయం. ఉద్దేశపూర్వకంగా పెట్టకపోయినా గోపీచంద్ సినిమాల పేర్లకు చివరన సున్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన విలన్‌గా చేసిన ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’.. కథానాయకుడిగా నటించిన ‘యజ్ఞం’, ‘రణం’, ‘లక్ష్యం’, ‘లౌక్యం’, ‘సౌఖ్యం’, ‘శంఖం’, ‘శౌర్యం’, ‘సాహసం’, ‘పంతం’ ఆ జాబితాలోనివే. ఈ విషయంలో ‘రామబాణం’ 13వ చిత్రం.
డింపుల్ హయాతి (డింప్లె హయథి) ఈ సినిమాలో కథానాయిక. ఇందులో ఆమె యూట్యూబర్ భైరవిగా కనిపిస్తుంది. పక్కింటి అమ్మాయి తరహా పాత్రైన భైరవికి సెట్ అవుతుందో లేదోనని రెండు సార్లు స్క్రీన్ టెస్ట్ చేసి మరీ రామబాణానికి డింపుల్‌ను ఎంపిక చేశారు.. ‘రామబాణం’లో గోపీచంద్ వ్యాపారవేత్తగా, ఆయన సోదరుడిగా జగపతిబాబు, వదినగా ఖుష్బూ నటించారు. వినోదాత్మక సన్నివేశాలతోపాటు కథలో ఆహార కల్తీ అంశాన్ని అంతర్లీనంగా ప్రస్తావించారు.
ఆర్గానిక్ ఫుడ్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మంచి గుర్తింపు ఉన్న హీరో సినిమాలకి సంగీతమూ ప్రధానమే. అందుకే ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్‌ను ఎంపిక చేశారు. గోపీచంద్, మిక్కీ కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఐఫోన్’ సాంగ్ నెట్టింట వైరల్ అయింది. సినిమాని రూపొందించడం ఒకెత్తైతే దాన్ని ప్రేక్షకులకు చేరువ చేయడం మరో ఎత్తు.
ఎక్కువ మందికి సినిమా రీచ్ అవ్వాలంటే క్రియేటివ్‌గా ప్రమోట్ చేయాల్సిందే. ఈ విషయంలో మిగిలిన చిత్ర బృందాల కంటే ఓ అడుగు ముందే ఉంది ‘రామబాణం’ టీమ్. ఓ సంస్థ విక్రయించే పాల ప్యాకెట్లపైన సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రచురించి, అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ అభిమాని తన ఫేవరేట్ హీరోయిన్ సమంత గుడి కట్టించి.. అందులో ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక ఇప్పుడు మరో కథానాయిక కోసం గుడి కడతా అన్నాడు.
రామబాణం చిత్రయూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో ఓ అభిమాని.. డింపుల్ హయాతి కోసం గుడి కట్టించాలనుకుంటున్నానని.. అది పాలరాతితోనా.. లేదా ఇటుకతో కట్టించనా అని అడిగాడు. వెంటనే డింపుల్ స్పందిస్తూ.. రెండూ కాదు.. బంగారంతో కట్టించినప్పుడు చెప్పు అంటూ కౌంటరిచ్చింది.