రిలయన్స్ గ్రూప్స్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీపై నెటిజన్లు చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అవకాశాలు అందిపుచ్చుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడమే ఆయన లక్ష్యం అనీ, ఆయన తన సంపద సృష్టి పై ఉన్న ఆశక్తి.. దేశ ప్రజల మనోభిప్రాయాలపై లేదని సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.
భారతదేశంలో టిక్ టాక్ కొనుగోలుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అది రిలయన్స్ సంస్థ చేజిక్కించునే అవకాశం ఉన్నట్టు వార్తలు రావడమే వారి ఆగ్రహానికి కారణం.చైనా యాప్స్ నిషేధాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న క్రమంలో టిక్ టాక్ పై మాత్రమే బేరసారాలు జరపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక వైపున సరిహద్దుల్లో సైన్యం చైనాతో పోరాటం చేస్తూ ఉంటే రిలయన్స్ గ్రూప్ మాత్రం డబ్బుల వేటలో ఉందని ఎద్దేవా చేస్తున్నారు.
