Kamal Sivakarthikeyan New Movie : లోకనాయకుడు కమల్ హాసన్ తాను సినిమా ద్వారా సంపాదించిన ప్రతి రూపాయి తిరిగి దానికే ఖర్చు చేయడం గర్వకారణం. వరుస పరాజయాల తర్వాత విక్రమ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో కమల్ మూవీ ప్రొడక్షన్ పై దృష్టి పెట్టాడు. తాజాగా ఈ రోజు కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ SK21 వర్కింగ్ టైటిల్ తో చెన్నై లో మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
శివ కార్తికేయన్ రెండు సినిమాలు ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉండగా.. కొత్తగా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గార్గిలో చివరిగా కనిపించిన సాయి పల్లవి చాన్నాళ్ల తర్వాత ఈ చిత్రంలో శివకార్తికేయన్‌తో జతకట్టనుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు రాజ్ కుమార్ కాగా, ఈ రోజు పూజ కార్యక్రమంలో సాయి పల్లవి,
శివ కార్తికేయన్, కమల్ హాసన్, డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా కమల్ తో పాటు సోనీ పిక్చర్స్ ఫిలింస్ ఇండియా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించనుంది. దీనికి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ ‘SK21’ 1:20 మినిట్స్ ముహూర్త పూజ వీడియోను రిలీజ్ చేయగా అందులో నటీనటుల ఎంట్రీ అదిరిపోయింది.
#SK21 The Journey begins #Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #SK21 #RKFIProductionNo_51@ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran @Rajkumar_KP @gvprakash @Sai_Pallavi92 @RKFI @ladasingh @SonyPicsIndia… pic.twitter.com/myiW77GRcR
— Raaj Kamal Films International (@RKFI) May 5, 2023