Sreeleela : నేనటాంటి ఇటాంటి ఆడదాన్ని కాదు.. పల్సర్ బైక్ మీద రారా బావ అంటూ కురాళ్ళ పల్స్ రేట్ పెంచి దానితో పాటు తన రెమ్యూనరేషన్ కూడ పెంచుకుంది. అమెనే తెరపై చూడబుద్దవువుతోంది, మాట్లాడబుద్దవుతోంది అంటూ కుర్ర హీరోలు, దర్శక నిర్మాతలు వెంపర్లాడుతున్నారు, వెంటపడుతున్నారు. పెళ్లి సందడి చిత్రంతో రోషన్ సరసన అమ్మాయి శ్రీలీల టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
భారీ బ్లాక్ బస్టర్ అయిన రవితేజ ధమాకాతో ఆమె మంచి విజయాన్ని అందుకుంది. శ్రీలీల డ్యాన్స్ మూవ్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఆ తర్వాత ఈ యువనటి వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె ఇప్పుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB28, మరియు నందమూరి బాలకృష్ణ 108వ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన VD12లో నటించనుంది. తమ చిత్రాల కోసం ఈ యంగ్ బ్యూటీనే ఉండాలని హీరోలు కూడా తహతహలాడుతున్నారు.
టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల తాజాగా మెగా ఛాన్స్ కొట్టేసింది. చిరు నెక్స్ట్ మూవీ కోసం ఈ బ్యూటీని ఫిక్స్ చేశారట మేకర్స్. భోళా శంకర్ షూటింగ్ కంప్లీట్ అవగానే ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలుకానుంది. ఈ సినిమాలో శ్రీలీల పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండనుందని సమాచం. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. తమిళ హిట్ మూవీ వేదాలంకి రీమేక్ గా రానున్న ఈ మూవీని మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు.
ఈ మధ్యే ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోలకతాలో స్టార్ట్ అయ్యింది. ఆ షూటింగ్ కి సంబంధించిన ఫోటోస్ ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మెగాస్టార్ టాక్సీ డ్రైవరుగా కనిపిస్తున్న ఈ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా తరువాత.. చిరు సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కథా చర్చలు కూడా ఇప్పటికే మొదలయ్యాయని సమాచారం.
ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మరో యంగ్ హీరో కూడా నటించనున్నాడట. ఆ యంగ్ హీరో మరెవరో కాదు టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నళగడ్డ. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ మూవీలో సిద్దుకి పెయిర్ గా శ్రీలీలని తీసుకోనున్నారట. మరి మెగాస్టార్ కి జోడీగా ఎవరు నటించనున్నారు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉంది.