Jr NTR TeleVision Entry : స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు పెట్టుకొని ఇండస్ట్రీలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 18 ఏళ్ళ వయస్సులోనే ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. తారక్ తర్వాత చేయబోయే సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు.. బుల్లి తెరపై కూడా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు చేయగా ఈ షోకు కూడా మంచి స్పందనే వచ్చింది. ఆ తర్వాత తారక్ సినిమాలతో బిజీ అయిపోవడంతో బుల్లితెరకు కొంతకాలంగా దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా సినీ సర్కిల్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈటీవీ ఓ మెగా టాక్ షో ఎన్టీఆర్ తో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తుందట. ఇంతకు ముందుకు రానా హోస్ట్ చేసిన నెం.1 యారి తరహాలో ఈ టాక్ షో ఉండబోతుందని కూడా అంటున్నారు. ఈటీవీ ఇటీవలే ఓటీటీలోకి కూడా అడుగుపెట్టింది.
విన్ పేరుతో లాంచ్ చేసిన యాప్ కి సబ్స్క్రిప్షన్ రేట్లు పెట్టి థియేటర్ లో రిలీజ్ కాని స్ట్రెయిట్ సినిమాలను డైరెక్ట్ స్ట్రీమింగ్ కోసం కొంటోంది. ఇప్పుడీ ఓటీటీ పాపులారిటీని మరింత పెంచడం కోసమే జూనియర్ ఎన్టీఆర్ ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. ఒకవేళ నిజంగా ఈ ప్రపోజల్ కార్యరూపం దాలిస్తే ఈటీవీకి ఓ అస్త్రం దొరికినట్టు అవుతుంది. ఇక సినిమాల విషయానికి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30 చేస్తుండగా, ఆ తర్వాత హృతిక్ రోషన్ తో వార్2, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో మూవీ చేయనున్నాడు యంగ్ టైగర్.
Discussion about this post