Chiranjeevi Crazy Line Up : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలతో పోటీగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్యతో హిట్లు కొట్టిన చిరు హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కలకత్తాలో జరుగుతుంది. ఈ మూవీ తమిళ్ చిత్రం వేదాళం మూవీకి రీమేక్ అని తెలిసిందే.
ఇందులో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లు కాగా ఇందులో కీర్తి సురేష్ హీరోకి చెల్లెలి పాత్రలో నటిస్తుంది. దీనిని గ్రాండ్ లెవెల్లో క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ మూవీని ఆగష్టు 11న విడుదల కానుంది. అయితే దీని తర్వాత మెగాస్టార్ మూవీస్ ఏంటీ అనేదానిపై ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ తన కెరీర్ 156వ సినిమాని బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీని మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించనున్నట్టు సమాచారం. ఈ మూవీ అనంతరం 157వ సినిమాని ఇటీవల బింబిసార మూవీతో పెద్ద సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కించనున్నారట. కాగా ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించనుందట. ఫైనల్ గా మెగాస్టార్ క్రేజీ లైనప్ పై టాలీవుడ్ లో బజ్ మారింది. చిరు నెక్స్ట్ మూవీస్ పై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
Discussion about this post