Varun Tej Next Movie : మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒకపక్క కామెడీ, మరోపక్క మాస్, ఇంకా రొమాంటిక్ స్టోరీలు చేస్తూ తనదైన శైలిలో సత్తా చాటుతున్నాడు. గద్దల కొండ గణేష్ వంటి పవర్ ఫుల్ మాస్ సబ్జెక్టు నీ అద్భుతంగా డీల్ చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. అంతకుముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాలో సరికొత్త ప్రేమ కథ జోనర్ తో అదిరిపోయే విజయం అందుకున్నాడు.

వరుణ్ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా వరుణ్ ఓ పీరియాడిక్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పలాస ఫేమ్ కరణ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడట. కరణ్ చెప్పిన స్టోరీ వరుణ్ కి తెగ నచ్చిందట. దీంతో పీరియాడిక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మెగా ప్రిన్స్. స్వాతంత్య్రం అనంతరం సాగే ఓ సామాజిక సమస్యని పరిష్కరించే ఇతివృత్తంతో కథ సాగుతుందని సమాచారం.
వైరా ఎంటర్ టైన్ మెంట్స్ ఈ మూవీని నిర్మించనుందట. ప్రెసెంట వరుణ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ లో నటిస్తున్నాడు. దీని తర్వాత శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేయనున్నాడు. వీటి తర్వాత కరణ్ కుమార్ తో చిత్రం సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రెసెంట్ ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం.
