Allu Arjun Met His Teacher Ambhika : అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అప్పటి వరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీ, పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారాడు. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు బన్నీ. పుష్ప1 సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప2 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే దర్శకుడు సుకుమార్ ఈ ముహూర్తంలో అయితే అల్లు అర్జున్ కి ఐకాన్ స్టార్ అని పెట్టాడో కానీ అదే అక్షరాల నిజమైంది. తాజాగా బిహైండ్ వుడ్స్ అనే ప్రముఖ సంస్థ అందించే గోల్డెన్ ఐకానిక్ అనే అవార్డ్ ను ఐకాన్ స్టార్ బన్నీ గెల్చుకున్నాడు. తమిళనాడులో జరిగిన ఈ వేడుకకి బన్నీ హాజరవ్వగా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అయితే ఈ ఫంక్షన్ లో అల్లు అర్జున్ తన చిన్ననాటి టీచర్ అంబికా రామకృష్ణన్ ను కలిసాడు.
తన 3వ తరగతిలో అంబికా టీచర్ తనను చాలా మోటివేట్ చేశారు అని తెలిపాడు. తనకు ఎంతోమంది టీచర్స్ ఉండగా ఈ టీచర్ తన ఫెవరేట్ అని బన్నీ అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలావుండగా ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతుంది. ప్రెసెంట్ ఫాహాద్ ఫజిల్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్.
Icon Star @alluarjun Meets His School Teacher After 30 Year's ❤️🔥
Thank You So Much @behindwoods 🥺#Pushpa2TheRule #PushpaTheRule pic.twitter.com/0IdGBj2PTL
— TelanganaAlluArjunFC™ (@TelanganaAAFc) May 9, 2023