Janasena Chief Pawan Kalyan : “మన బలం పెరిగింది. మన బలం ఎన్నికల్లో చూపిద్దాం. జనసేన అభ్యర్థులను గెలిపిద్దాం. వైసీపీ పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కల్పిద్దాం.” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీనీ ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతాం. మాకు పట్టున్న ప్రాంతాల్లో మా సత్తా ఏమిటో మేము చూపించగలం. మాకు పట్టున్న ప్రాంతాల్లో 30% మేము నిలదొక్కుకోగలం అని మాకు నమ్మకం ఉంది.
రాయలసీమ లాంటి ప్రాంతాల్లో జనసేన పార్టీ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ, 20% న్నీ మేము అక్కడ మేము ఆశిస్తున్నాం, పోయిన ఎన్నికల్లో కంటే ఈసారి ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వాలని అనుకుంటున్నాము, యావరేజ్ గా 14 ,17 శాతం ఉన్నప్పటికీ ఈసారి మాత్రం పట్టున్న ప్రాంతాల్లో పట్టులేని ప్రాంతాల్లో కూడా నిలదొక్కుకోవడానికి జనసేన వ్యూహాత్మకంగా నడుస్తుంది అని పవన్ కళ్యాణ్ వివరించారు.
ఇప్పుడు మా దృష్టి మొత్తం వైసిపి పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించడం, ప్రజల బాగోగులు చూసుకోవడం, వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాలను ప్రశ్నించడమే మా ప్రధాన లక్ష్యం. ముఖ్యమంత్రి పదవి అనేది తానంతట తానే వరించాలి. తప్ప నాకు ఆ పదవ మీద ఎలాంటి ఆశ లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.
రాజకీయాల్లో నిస్వార్ధంగా, ప్రజల సమస్యల పైన, ప్రజల శ్రేయస్సు, సంక్షేమం పైన దృష్టి పెట్టాలి తప్ప, పదవుల పైన కాదు, నాకు ఎప్పుడూ కూడా పదవి వ్యామోహం లేదు. అని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. నేను బిజెపిని గాని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను కానీ ముఖ్యమంత్రి పదవి కోరను. 137 స్థానాల్లో 30, 40% సీట్లు గెలుచుకున్నప్పుడు మాత్రమే సీఎం పదవిని అడిగే హక్కు ఉంటుంది.
కానీ నాకు అటువంటి పదవి కాంక్ష లేదు. నేను ప్రజల్లో మమేకమై ఉండాలనుకుంటున్నానని పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకుందాం, వైస్సార్‌సీపీ నుంచి తిరిగి అధికారం చేపడదాం, మరియు కూటమి ద్వారా ప్రజలకు తిరిగి అధికారం ఇద్దాం. అని – జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు.