గోదావరి నదిలో వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 17.40 అడుగుల నీటిమట్టం నమోదైంది. బ్యారేజ్ నుండి 18 లక్షల 46 వేల 428 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
సోమవారం మధ్యాహ్న సమయానికి 60.50 అడుగుల నీటిమట్టం నమోదైంది.
గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో లంక గ్రామాలు నీటమునిగాయి. పోలవరం నిర్వాసిత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజమహేంద్రవరం – మారేడుమిల్లి – భద్రాచలం రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. వరద పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అప్రమత్తమయ్యారు. నదీ పరివాహక ప్రాంతాల్లో NDRF రక్షణ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.