Cool Drinks : చిన్నవాళ్లు,పెద్దవాళ్లు కూల్ డ్రింక్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఈ వేసవిలో ఇంకా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేస్తూ ఉంటారు. అలాగే ఇళ్లల్లో ఏ శుభకార్యాలైనా, ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా కూల్ డ్రింక్స్ ని మర్యాదపూర్వకంగా ఇస్తూ ఉంటారు. కానీ ఈ కూల్ డ్రింక్స్ ఎప్పుడో ఒకసారి మనం తాగుతూ ఉంటాము.
కానీ ఇప్పుడు చెప్పుకోపోయే వ్యక్తి మాత్రం కేవలం ఈ కూల్ డ్రింక్స్ తాగి మాత్రమే బతికేస్తున్నాడు. ఆయనకి అన్నం తింటే అరగదంట.. కూల్ డ్రింక్స్ మీదే రోజులు గడిపేస్తున్నారు. ఆ వింత మనిషి ఎక్కడ ఉన్నాడో, ఆయనకి అలవాటు ఎలా వచ్చిందో చూద్దాం.. ఇరాన్‌కు చెందిన ఘోలమ్రేజా అర్దెషిరి జూన్ 2006 అంటే దాదాపు 16 సంవత్సరాల నుండి ఆహారం తినడం మానేసాడు. రోజుకు మూడు పూటలా కడుపునిండా డ్రింక్స్ తాగుతూ ఆయన కూల్ డ్రింక్స్ పైనే బతికేస్తున్నాడు.
కానీ ఇన్ని రోజులు అన్నం తినకుండా బ్రతకడం అంటే మామూలు విషయం కాదు. ఆయన అలా మారడానికి తన ఆరోగ్యం సమస్య కారణంగా చెబుతున్నాడు. అదేంటంటే.. తన నోటిలో వెంట్రుక ఒకటి అడ్డంగా ఉన్నట్లు ఆయనకు అనిపిస్తుంది అంట. అది నోటి నుండి కడుపు చివరి వరకు ఉన్నట్లు, తనకు ఇబ్బందికరంగా లాగుతున్నట్లు అనిపిస్తుంది అంటారు.
ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్లినా ఎవరూ కూడా తన సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వలేకపోయారు. ఆ వెంట్రుక కారణంగా తాను ఆహారానికి దూరమయ్యాడని అని అర్దెషిరి వివరించాడు. వైద్యం ఇంతలా డెవలప్ అవుతున్న రోజులలో కూడా అర్దెషిరి సమస్యకు వైద్యశాస్త్రంలో పరిష్కారం లేకపోవడం గమనార్హం.