Currency : భారతదేశ కరెన్సీ కి దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. భారతదేశంలో నాణాలు ఎప్పటినుంచో ముద్రించబడి తర్వాత నోట్లుగా మార్పు చెందాయి. ఇప్పుడున్న ఇండియన్ కరెన్సీని మనం చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం భారతదేశ కరెన్సీని జారీ చేస్తుంది. మెటల్ నాణాలు లేక
కాగితం నోట్లను ఆర్బీఐ జారీ చేస్తుంది. అయితే ఇప్పుడున్న ఇండియన్ కరెన్సీలో చాలా మార్పులు మనం గమనించవచ్చు. భారతదేశంలోని అన్ని కరెన్సీలపై గాంధీజీ చిత్రాన్ని ముద్రించి ఉండటం మనం చూస్తుంటాం అయితే 1969లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లపై గాంధీ చిత్రాన్ని మొట్టమొదటిసారిగా ముద్రించింది.
ఈ ఫోటో బర్త్ సెంటెనరీ మెమోరియల్ డిజైన్ కలిగి ఉండడంతో పాటు ఈ ఫోటోలో వెనుక వైపున సేవాగ్రామ్ ఆశ్రమం కూడా ఉంటుంది. ఇంతకుముందు ఈ నోటు పై అశోక చక్రం అశోక స్తంభం ఉండేది చిత్రం ఉండేది. అయితే తర్వాత వంద రూపాయల నోటుపై పర్వతాన్ని ముద్రించారు. మరి ఈ పర్వతం ఎక్కడిది.

నోటుపై దీన్ని ముద్రించడానికి గల కారణం ఏమిటి? రూ.100 నోటుపై ఉన్న పర్వతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మూడవ పర్వతమైన కాంచనగంగా అనే పర్వతం. ఈ ఫోటో భారత దేశంలోని చిన్న రాష్ట్రమైన సిక్కిం లోని పెల్లింగ్ నుంచి తీసుకున్నారు. నేపాలి భాషలో ఈ
పర్వతాన్ని కాంచన్ జంగా అని, ఇంగ్లీషులో అయితే కంచన్ జాఘా అని పిలుస్తారు. భారతదేశంలోని సిక్కిం రాష్ట్రానికి వాయువ్యంగా నేపాల్ దేశ సరిహద్దుల్లో ఇది ఉంది. కాంచన గంగ 8,586 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఇది హిమాలయ పర్వత శ్రేణిలో ఒక భాగం.
