Parrots : రామచిలకలు తెలియని వారంటూ ఎవరు ఉండరు. జ్యోతిష్యం చెప్పే వారి దగ్గర పంజరంలో రామచిలుకలు మనం చూస్తూ ఉంటాము. రామచిలుకలు జ్యోతిష్యం చెప్తే చాలా వరకు నిజమే జరుగుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే కొన్ని పెంపుడు చిలుకలు మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉంటాము.
కొంతమంది చిలకలను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. వాటికి మాటలు నేర్పించి సరదాగా వాటితో గడుపుతారు.అసలు రామచిలుకలను ఇంట్లో పెంచడం మంచిదేనా..? అలా ఇంట్లో పెంచుకోవచ్చునా..? వాటిని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఏదైనా అరిష్టం జరుగుతుందా..? ఇప్పుడు తెలుసుకుందాం. చాలావరకు చిలుకల్ని ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదు అని చెప్తూ ఉంటారు.

దాంట్లో ఎంత నిజం ఉందో చూద్దాం. రామచిలుకలు ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందరికీ చిలకలు పెంచుకోవడం కుదరకపోవచ్చు.అలాంటప్పుడు చిలకలకు సంబంధించిన ఫోటోలను తూర్పు లేక ఉత్తరం వైపు పెడితే ఆ ఇంటి వారికి మేలు జరుగుతుంది.
రామచిలకలను ఇంట్లో పెంచడం వల్ల శని ప్రభావం కూడా ఆ ఇంటి వారికి సోకదు. పంజరంలో చిలుకలని పెంచినట్లయితే వాటిని ఉత్తరం లేక తూర్పు వైపుకు పెడితే మంచి జరుగుతుందంట. ఇంట్లో చిలకలు పెంచడం వల్ల పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
