MS Dhoni Net Worth : భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడు. ఇండియాకు ఎన్నో తిరుగులేని విజయాలు అందించాడు మహేంద్రసింగ్ ధోని. టెస్టుల్లో టీమిండియాను అగ్రస్థానంలో నిలపడంతో పాటు.. టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్‌కు అందించాడు. కెరీర్ ఆరంభంలో హెలికాప్టర్ షాట్‌తో అభిమానులను అలరించిన మహీ.. కెప్టెన్ అయ్యాక ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కూల్‌గా ఆలోచిస్తూ మిస్టర్ కూల్‌గా పేరు సంపాదించాడు.
భారత క్రికెట్ టీమ్‌కు అడపాదడపాగా దక్కే విజయాలను అలవాటుగా మార్చేసిన మహేంద్రుడు సైలెంట్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు. మహీ ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ అతని బ్రాండ్ విలువ తగ్గకపోగా.. రోజురోజుకీ పెరుగుతూ ఉండడం విశేషం. నాలుగు పదుల వయసులోనూ ధోని అద్భుతమైన ఆటతీరుతో, కెప్టెన్సీతో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఎన్నో విజయాలు అందిస్తూ..
తన బ్రాండ్ వాల్యూతో పాటు ఆస్తులను కూడా పెంచుకుంటూ పోతున్నాడు ఝార్ఖండ్ డైమైండ్ ధోని. ఓ అంచనా ప్రకారం ధోనీకి రూ.1,040 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయట. చెన్నై జట్టు కెప్టెన్ గా ధోని ఒక సీజన్ కు రూ.12 కోట్లు తీసుకుంటాడట. దీనికి తోడు పలు స్టార్టప్ లు, కంపెనీల్లోనూ ధోనీకి పెట్టుబడులు ఉన్నాయి. అంతేకాదు ఖాతాబుక్, కార్స్24, శాకాహారి, గరుడ ఏరోస్పేస్ (డ్రోన్ల కంపెనీ)లోనూ మహికి పెట్టుబడులున్నాయి. ఫిట్ నెస్, లైఫ్ స్టయిల్ బ్రాండ్ సెవెన్ లోనూ మెజారిటీ వాటాలున్నాయి.
కోకకోలా, ఇండియా సిమెంట్స్, డ్రీమ్ 11, గోడాడీ, రీబాక్, స్వరాజ్ ట్రాక్టర్స్ ఇలా ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ధోని రెండు చేతులా సంపాదిస్తున్నాడు. వీటికి తోడు, ఫుట్ బాల్ జట్టు చెన్నియన్ ఎఫ్ సీ, హాకీ జట్టు రాంచీ రేస్, మహీ రేసింగ్ టీమ్ ఇండియా ఫ్రాంచైజీల్లోనూ ధోనీకి పెట్టుబడులు ఉన్నాయి. ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ సినిమా కోసం రూ.30 కోట్లు పుచ్చుకున్నాడు. దీన్నిబట్టి ధోని ఆటలోనే కాదు సంపదలోనూ నెంబర్ వన్ అని అర్థమవుతుంది. ఎన్ని ఆస్తులున్నా రాంచీలో ఆ వ్యవసాయ క్షేత్రంలో సాధారణ రైతుల కష్టపడుతుంటాడు ధోని.
Discussion about this post