Astro Tips : మన గ్రంథాలలో, పురాణాలలో వస్తువులను దానం చేసే విషయాల గురించి ప్రస్తావించారు. మన దగ్గర ఉండే కొన్ని వస్తువులను ఎవరికైనా దానం చేస్తే మనకు ఉన్నటువంటి అదృష్టం కూడా ,ఆ వస్తువుల రూపంలో వెళ్ళిపోతుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఏలాంటి వస్తువులను మనం ఇతరులకు దానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
చీపురు : లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని చాలామంది హిందువులు నమ్ముతుంటారు. అందుకే ఎవరూ కూడా చీపురును కాలితో తాకరు. చీపురును ఎవరికి దానం చేయకూడదు అని గ్రంధాలలో ఉంది. అలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
బియ్యం : బియ్యం శుక్ర గ్రహానికి సంబంధించినవిగా బియ్యాన్ని పరిగణిస్తారు. ఈ బియ్యాన్ని ఎవరికైనా దానం చేస్తే శుక్ర గ్రహ దోషం వస్తుందని చాలామంది అభిప్రాయపడతారు. ఇలా దానం చేయడం వల్ల అనారోగ్య, ఆర్థిక సమస్యలు రావడమే కాక ఇంట్లో ప్రతికూల శక్తులు చేరుతాయి. కాబట్టి బియ్యాన్ని ఎవరికి దానం చేయకూడదు.
పెన్ను లేక కలం : కలంను పురాణ గ్రంథాలలో అదృష్టానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. కలంతో అనేక పనులు ముడిపడి ఉంటాయి. ఎవరికైనా పెన్నులను దానం చేస్తే మన దగ్గర ఉన్నటువంటి సంపద ఫలం మొత్తం అవతలి వ్యక్తికి చెందుతుందని, చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అందుకే పెన్నును దానంగా ఇవ్వకూడదు.
బట్టలు : శాస్త్ర ప్రకారం బట్టలను ఎవరికి దానం చేయకూడదు. మీకు సంబంధించిన బట్టలను వేరే వారికి దానం చేస్తే, ఆ ప్రతికూల శక్తి ప్రభావం మీ మీద ఉంటుంది.
దువ్వెన : చాలామంది ఇతరుల దువ్వెనను ఉపయోగిస్తూ ఉంటారు. అలా చేయడం అసలు మంచిది కాదు. మీ దువ్వెనను ఎవరికైనా ఇచ్చినట్లయితే మీ అదృష్టం వారి చెంతకు చేరుతుంది. కాబట్టి దానం చేయడం మంచిది కాదు.