Pawan Kalyan : పవర్ స్టార్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా వస్తుంది అంటే.. టీజర్ వచ్చినప్పటి నుంచే సెలబ్రేషన్స్ స్టార్ చేస్తారు ఫ్యాన్స్.. ఇంకా ఆయన పుట్టిన రోజుకైతే.. 100 రోజుల ముందు నుంచే కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఎంత పోగొట్టుకున్నా.. ఎన్ని విజయాలు చూసిన, మరెన్ని పరాజయాలు పలకరించినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో.. చెక్కు చెదరని గుండె ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు జనసేనాని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం పవన్ రెమ్యూనరేషన్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటీవల ఓ సభలో పవర్ స్టార్ మట్లాడుతూ “నేను ఒక్కరోజు షూటింగ్ కు 2 కోట్లు తీసుకుంటాను” అని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీనిపై సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ ఇండైరెక్టు గా పవన్ పై వ్యాఖ్యలు చేశాడు.
దీంతో పవన్ ఫస్ట్ రెమ్యూరేషన్ ఎంత తీసుకున్నాడనే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. పవన్ 1996లో కల్యాణ్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ మూవీకి పవర్ స్టార్ నెలకు రూ. 5000 వేల చొప్పున మొత్తం రూ.50,000 ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఆ మొత్తాన్ని తన చేతిలో పెట్టాడట పవన్. నెలకు 5వేల నుంచి రోజుకి 2 కోట్ల రేంజ్ కు ఎదగడానికి తన అభిమానులే కారణం అంటాడు పవర్ స్టార్.