Mobile : ఫోన్ ఇప్పుడు ప్రతిఒక్కరి దినచర్యలో ఒక భాగం. ఈ మొబైల్ లేకుండా ఎవరికి ఒక రోజు మొదలవదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతిఒక్క పని ఇప్పుడు మొబైల్ తోనే సాధ్యం. మనిషికి ఒక స్నేహితుడిలా మొబైల్ రోజువారి జీవితంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. అలాంటి మొబైల్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత మార్కెట్లో మొబైల్ కంపెనీలు ఎన్నో రకాల మోడల్స్ ని తీసుకువస్తూ ప్రజలకు మరింత సౌకర్యవంతంగా అందిస్తున్నాయి. పొద్దాక మన చేతిలో ఉండే మొబైల్ గురించి అన్ని విషయాలు మనకు తెలియదు. ముఖ్యంగా మొబైల్ ని మనం గమనించినట్లయితే దానికి కింది భాగంలో ఒక హోల్ ఉంటుంది. ఎప్పుడైనా ఆ హోల్ గురించి మీరు ఆలోచించారా..

దానిని ఎందుకు పెట్టారు.. దాని వల్ల ఉపయోగం ఏమిటి.. అన్ని మొబైల్ కంపెనీలు స్మార్ట్ ఫోన్ కి ఒక చిన్న హోల్ అనేది ఇస్తూ ఉంటారు. అయితే ఈ హోల్ వల్ల చాలా పెద్ద ఉపయోగం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదట్లో ఫోన్ కు ప్రజలు అలవాటు పడుతున్న సమయంలో ఫోన్ మాట్లాడేటప్పుడు చాలా అసౌకర్యంగా మధ్యలో ఒక రకమైన డిస్టర్బెన్స్ వచ్చేది.
దానివల్ల అవతలి వ్యక్తి మాట్లాడేది మనకు సరిగా అర్థం కాక ఇబ్బందిగా అనిపించేది. దీనినే నాయిస్ డిస్టబెన్స్ అనేవారు. కానీ తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే ఫోన్ మాట్లాడేటప్పుడు ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా చాలా క్లియర్ గా వినిపిస్తూ వచ్చింది. దానికి కారణం ఏమిటంటే..తర్వాత వచ్చిన స్మార్ట్ ఫోన్ లోకి కింద భాగంలో ఒక హోల్ ని ఇచ్చారు.

ఫోన్ లో మినీ మైక్రోఫోన్ ని అమర్చారు. దీనివల్ల నైస్ క్యాన్సిలేషన్ డివైస్ గా ఇది పనిచేస్తుంది. అలా అమర్చడం వల్ల ఫోన్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట స్పష్టంగా వినబడింది. అయితే చాలామంది ఈ ఫోన్ కి హోల్ ని ఎయిర్ కోసం చేశారు అని అపోహ పడ్డారు. కానీ అసలు కారణం ఇది. దానిని చేసింది నాయిస్ కోసం.
