Varahi VijayaYatra : విజయవంతంగా కొనసాగుతున్న వారాహి యాత్రలో ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ రాబోయే రోజులలో జనసేన ఏ స్థానంలో ఉంటే ప్రజల సమస్యలు తీరుతాయి అనే విషయం పైన మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతునిచ్చి ముఖ్యమంత్రి స్థానం ఇవ్వగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మాటిస్తున్నాను.
దత్తాత్రేయ అంశలోని శ్రీపాద వల్లభుడు క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పేరాపురం నుంచి అర్ధిస్తున్నాను. దశాబ్దం తర్వాత అన్ని అంశాల మీద పూర్తి అధ్యయనం చేసి సంపూర్ణ అవగాహనతో ఈరోజు మీ ముందు నిలబడ్డాను అని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని పవన్ కళ్యాణ్ విజయ యాత్రలో భాగంగా హామీ ఇచ్చారు.

ఈ రాష్ట్రంలో ఎంత గొడవలు జరిగితే వైసీపీ అంత లాభపడుతుందనేది వైసీపీ నాయకుడి గేమ్ ప్లాన్. పిఠాపురం రాగానే నాకు రాష్ట్రంలో జరిగిన హిందూ ఆలయాల మీద దాడులు గుర్తుకొచ్చాయి. ఆధ్యాత్మిక క్షేత్రం పిఠాపురం నుంచే ఈ దాడులు మొదలయ్యాయి. 219 హిందూ ఆలయాల మీద దాడులు, విగ్రహాల ధ్వంసం సంఘటనలు జరిగితే ఒక్కరిని కూడా వైసీపీ ప్రభుత్వం పట్టుకోలేదు. దీని వెనుక చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన దాగుంది. వైసీపీ నాయకుల కుట్ర దాగుంది.
వరుసగా హిందూ ఆలయాల మీద దాడులు జరిగితే సనాతన ధర్మం నమ్మే హిందువులంతా వేరే మతస్థులను అనుమానించాలి. దాని ద్వారా వారితో గొడవ పడాలి. సమాజంలో ఘర్షణలు చెలరేగితే వైసీపీ దాని నుంచి టోలెడు లాభం పొందాలనే చచ్చు ప్రభుత్వం ఆలోచనలతోనే వరుసగా ఆలయాల మీద దాడులు జరిగాయి. సమాజంలో ఎన్ని గొడవలు జరిగితే వైసీపీ నాయకులకు అంత ఇష్టం. యువకులు తమ భవిష్యత్తును వదిలేసి పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే ఈ నాయకులు అంత ఆనందపడతారు.

జనసేన అధికారంలోకి వస్తే సంరక్ష ఆంధ్రప్రదేశ్ నీ సాధిస్తామని ఈ ప్రజాముఖంగా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా గంజాయిని కూడా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలు ఎన్నో తీసుకురావాల్సిన అవసరం ఉంది. యువతకు మొండిచేయ్ చూపిస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దే దింపాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కులం చూసి కాదు గుణాన్ని చూసి మీ ఓటు జనసేనకు వేసి మాకు స్థానాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నామని పవన్ కళ్యాణ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
