Ram Charan : RRR బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రెసెంట్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తోండగా.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తన ప్రతి మూవీలో సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తాడు గేమ్ ఛేంజర్ లో కూడా తన స్టైల్ కి తగ్గట్టే ప్లాన్ చేసాడని టాక్.
అయితే ఈ మూవీ షూట్ స్టార్ట్ అయ్యి సంవత్సరం గడుస్తున్నా రిలీజ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. మొన్న చరణ్ బర్త్ డే కి టైటిల్ అనౌన్స్ మెంట్ మినహా పెద్దగా అప్డేట్స్ ఏం ఇవ్వట్లేదు మేకర్స్. షూటింగ్ ప్రారంభమై కొన్ని రోజులు వేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం గతకొంత కాలంగా కొత్త షెడ్యూల్ ఏం ప్లాన్ చేయలేదు. అయితే డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ కొంతకాలం వాయిదావేసి కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్టు సమాచారం.

డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 షూటింగ్ లో బిజీ అవ్వగా.. ఈ గ్యాప్ లో చరణ్ అంతర్జాతీయ వేదికలకు హాజరవుతూ ప్రసంగాలతో అదరగొడుతున్నాడు. తాజాగా మెగా ఫ్యామిలీలోకి మెగా ప్రిన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఏదేమైనా సోషల్ మీడియా వేదికగా గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్డేట్ ఇవ్వండి అంటూ రచ్చ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు మొన్న విజయ్ దేవరకొండ మూవీ లాంచ్ చేసినా ఫ్యాన్స్ మాత్రం గేమ్ ఛేంజర్ అప్డేట్ అంటూ గోల చేస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత కానీ వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కంటే ముందే సెట్స్ పై చరణ్ వెళ్లాడని ఫ్యాన్స్ సంతోషించినప్పటికీ ఎన్టీఆర్ మూవీ తర్వాతే చెర్రీ మూవీ వచ్చేలా ఉంది. ఏదేమైనా మేకర్స్ వీలైనంత త్వరగా ఏదైనా అప్డేట్ ఇస్తే కానీ ఫ్యాన్స్ శాంతించేలా లేరు, చూడాలి ఏం చేస్తారో..
