Devara Update : RRR సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. తారక్ తర్వాత చేయబోయే సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. తారక్ నెక్స్ట్ క్రేజీ లైనప్ సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే జూనియర్ ప్రెసెంట్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవరలో నటిస్తున్నాడు. ఈ మూవీలో యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండగా రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గతకొంత కాలంగా ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆ మధ్య రామోజీఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకోగా మొన్నటి వరకు శంషాబాద్ లో ఓ భారీ సెట్ లో షూటింగ్ కంప్లీట్ చేశారు మేకర్స్. ఇందులో తారక్ సహా సైఫ్ తదితర కీలక నటులు పాల్గొనగా కొరటాల భారీ యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించారు.
నెక్స్ట్ షెడ్యూల్ ని జులై మొదటి వారం నుంచి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్లాన్ చేశారు. ఈ మూవీలో ఎన్టీఆర్ తమ్ముడి పాత్ర కోసం యంగ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ను సంప్రదించినట్టు సమాచారం. ఎన్టీఆర్ ఈ ఏడాది ఎండింగ్ లోపే ఈ మూవీలో తన షూట్ అంతటినీ కూడా కంప్లీట్ చేసేయనున్నాడని తెలుస్తుంది. మొత్తానికి దేవర యూనిట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు. వచ్చే ఏడాది మే లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.
Discussion about this post